Shikhar Dhawan Injury Update: బెంగళూరుతో మ్యాచ్‌కు సిద్ధమైన గబ్బర్.. కీలక అప్‌డేట్ ఇచ్చిన కోచ్..

Shikhar Dhawan Injury Update: ధర్మశాల మైదానంలో ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య తుఫాన్ మ్యాచ్ జరగనుంది. అంతకుముందు విలేకరుల సమావేశంలో పంజాబ్ జట్టు అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ మాట్లాడుతూ.. ఏ జట్టుకైనా అత్యంత సీనియర్ ఆటగాడు టోర్నమెంట్‌కు దూరంగా ఉండటం చాలా నిరాశపరిచింది. శిఖర్ ధావన్ అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకడు. అతని నిష్క్రమణ మాకు మంచిది కాదు. గత వారం ఢిల్లీలో ధావన్ ఫిట్‌నెస్ అంచనా వేశారు.

Shikhar Dhawan Injury Update: బెంగళూరుతో మ్యాచ్‌కు సిద్ధమైన గబ్బర్.. కీలక అప్‌డేట్ ఇచ్చిన కోచ్..
Punjab Kings, Ipl 2024

Updated on: May 08, 2024 | 9:16 PM

Shikhar Dhawan Injury Update: ఐపీఎల్ 2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం కారణంగా అవుట్ అయ్యాడు. ధావన్ గాయం తర్వాత, శామ్ కుర్రాన్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని జట్టుకు ప్లేఆఫ్‌ల మార్గం చాలా కష్టంగా మారింది. ఈ సిరీస్‌లో, పంజాబ్ కింగ్స్ ఇప్పుడు మే 9న RCBతో తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ శిఖర్ ధావన్ తిరిగి వస్తాడా లేదా అనే దానిపై పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు.

శిఖర్ ధావన్‌పై బిగ్ అప్‌డేట్..

ధర్మశాల మైదానంలో ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య తుఫాన్ మ్యాచ్ జరగనుంది. అంతకుముందు విలేకరుల సమావేశంలో పంజాబ్ జట్టు అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ మాట్లాడుతూ.. ఏ జట్టుకైనా అత్యంత సీనియర్ ఆటగాడు టోర్నమెంట్‌కు దూరంగా ఉండటం చాలా నిరాశపరిచింది. శిఖర్ ధావన్ అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకడు. అతని నిష్క్రమణ మాకు మంచిది కాదు. గత వారం ఢిల్లీలో ధావన్ ఫిట్‌నెస్ అంచనా వేశారు. చివరి రెండు లీగ్ మ్యాచ్‌లకు అతను తిరిగి ఫిట్‌గా ఉంటాడని మేం ఆశిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

పంజాబ్ కోసం డూ ఆర్ డై పరిస్థితి..

శిఖర్ ధావన్ RCBతో జరిగే మ్యాచ్‌కు కూడా దూరంగా ఉండబోతున్నాడని హాడిన్ ప్రకటన ద్వారా స్పష్టమైంది. ఏప్రిల్ 9న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతని భుజానికి గాయమైంది. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. పంజాబ్ కింగ్స్ జట్టు 11 మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో ఎనిమిదో ర్యాంక్‌లో ఉంది. ప్లేఆఫ్స్‌లో కొనసాగాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఆర్సీబీ తర్వాత పంజాబ్ రాజస్థాన్, హైదరాబాద్‌లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..