AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs PBKS Highlights : గెలుపు అవకాశాలు 9 శాతమే.. కానీ ఆ ముగ్గురే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు!

DC vs PBKS Highlights : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని మిల్లర్, ఆశుతోష్ పోరాటంతో ఛేదించి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను అక్షర్ పటేల్ నిలబెట్టాడు.

DC vs PBKS Highlights : గెలుపు అవకాశాలు 9 శాతమే.. కానీ ఆ ముగ్గురే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు!
Pbks Vs Dc
Rakesh
|

Updated on: May 12, 2026 | 7:00 AM

Share

DC vs PBKS Highlights : ఐపీఎల్ 2026లో మరో ఉత్కంఠభరిత పోరు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన చావోరేవో పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. ఒక దశలో ఢిల్లీ గెలిచే అవకాశాలు కేవలం 9 శాతం మాత్రమే ఉన్నాయని గణాంకాలు చెప్పాయి. కానీ కిల్లర్ మిల్లర్, ఆశుతోష్ శర్మ, కెప్టెన్ అక్షర్ పటేల్ అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. 211 పరుగుల భారీ టార్గెట్‌ను ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించి, ప్లేఆఫ్ రేసులో తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

ఢిల్లీ పని ఖతం అనుకున్న వేళ

లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఇన్నింగ్స్‌ను అక్షర్ పటేల్ నిలబెట్టాడు. 30 బంతుల్లో 56 పరుగులు చేసి అక్షర్ అవుట్ అయినప్పుడు ఢిల్లీ స్కోరు 14 ఓవర్లలో 138/5. అప్పటికి ఢిల్లీ గెలవాలంటే చివరి 30 బంతుల్లో 68 పరుగులు చేయాలి. చేతిలో ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. క్రీజులో ఉన్నది డేవిడ్ మిల్లర్ మాత్రమే కావడంతో పంజాబ్ విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ అసలు సినిమా అక్కడే మొదలైంది.

విధ్వంసం సృష్టించిన ఆశుతోష్

చివరి 5 ఓవర్లలో 68 పరుగులు చేయాల్సిన బాధ్యతను డేవిడ్ మిల్లర్, ఆశుతోష్ శర్మ భుజానికెత్తుకున్నారు. మొదట నిదానంగా ఆడిన మిల్లర్ (20 బంతుల్లో 28 పరుగులు), ఆ తర్వాత కేవలం 7 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని రన్ రేట్‌ను తగ్గించాడు. మిల్లర్ 51 పరుగుల వద్ద అవుట్ అయినా, ఆశుతోష్ శర్మ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. చివరి 3 ఓవర్లలో 36 పరుగులు అవసరమైన తరుణంలో మార్కస్ స్టోయినిస్ ఓవర్లో ఆశుతోష్, మాధవ్ తివారీ కలిసి 19 పరుగులు రాబట్టారు. ఆశుతోష్ కేవలం 10 బంతుల్లోనే 24 పరుగులు చేసి మ్యాచ్‌ను ఢిల్లీ వశం చేశాడు.

ఆకిబ్ నబీ మెరుపులు

చివరి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి. యశ్ ఠాకూర్ వేసిన ఓవర్లో ఆశుతోష్ అవుట్ కావడంతో మ్యాచ్ మళ్ళీ ఉత్కంఠగా మారింది. కానీ అప్పటికే ఢిల్లీ విజయానికి చేరువగా వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఆకిబ్ నబీ నో బాల్‌పై ఫోర్ బాదడమే కాకుండా, ఫ్రీ హిట్‌ను సిక్సర్‌గా మలచి ఢిల్లీకి ఘనవిజయాన్ని అందించాడు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో పరాజయాన్ని మూటగట్టుకోగా, ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ముందుకు దూకింది.

ప్లేఆఫ్స్ వెళ్లాలంటే ఢిల్లీ ఏం చేయాలి?

ఈ విజయంతో ఢిల్లీ 12 మ్యాచుల్లో 10 పాయింట్లు సాధించింది. అయితే ప్లేఆఫ్ బెర్త్ దక్కించుకోవడం అంత సులభం కాదు. మిగిలిన రెండు మ్యాచులను ఢిల్లీ భారీ నెట్ రన్ రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇతర జట్ల ఫలితాలు కూడా ఢిల్లీకి అనుకూలంగా రావాలి. ఏదేమైనా పంజాబ్ నోటికాడ విజయాన్ని లాగేసుకున్న ఢిల్లీ ఆటతీరుపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us