2సార్లు హ్యాట్రిక్‌లు.. ఆపై 2 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. ఆ కోరిక తీరకుండానే రిటైర్మెంట్?

Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 18వ సీజన్ చివరి రౌండ్‌లోకి ప్రవేశించింది. కానీ, ఈ కాలంలో చాలా మంది ఆటగాళ్ళు తమ పేరు మీద భారీ రికార్డులు సృష్టించారు. ఇందులో టీమిండియా లెగ్ స్పిన్ బౌలర్ కూడా ఉన్నాడు. టీం ఇండియాకు చాలా కాలంగా దూరంగా ఉన్నాడు.

2సార్లు హ్యాట్రిక్‌లు.. ఆపై 2 ఏళ్లుగా టీమిండియాకు దూరం.. కట్‌చేస్తే.. ఆ కోరిక తీరకుండానే రిటైర్మెంట్?
Pbks Ipl 2025

Updated on: May 06, 2025 | 12:44 PM

Team India: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భారత ఆటగాళ్లు బిజీగా ఉన్నారు. చాలా కాలంగా టీం ఇండియాలో భాగం కాని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ, కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఐపీఎల్‌లో ఒకటి కాదు రెండు హ్యాట్రిక్‌లు తీసి చరిత్ర సృష్టించిన ఆటగాడికి కూడా లక్ కలసిరావడం లేదు. సెలెక్టర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

ఐపీఎల్‌లో 2 సార్లు హ్యాట్రిక్స్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 18వ సీజన్ చివరి రౌండ్‌లోకి ప్రవేశించింది. కానీ, ఈ కాలంలో చాలా మంది ఆటగాళ్ళు తమ పేరు మీద భారీ రికార్డులు సృష్టించారు. ఇందులో ఒక పేరు లెగ్ స్పిన్నర్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ది. అతను టీం ఇండియాకు దూరంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో చెన్నైపై హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టించాడు. 18వ సీజన్‌లో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా చాహల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలో చాహల్ ఈ అద్భుతం చేయడం ఇది రెండోసారి. అంతకుముందు 2022 సంవత్సరంలో కేకేఆర్‌పై తన తొలి హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

టీం ఇండియాలోకి రీఎంట్రీ కష్టమే..

యుజ్వేంద్ర చాహల్ ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. ఈ ఆటగాడిలో ఎంతో ప్రతిభ ఉంది. వికెట్లు తీసే బౌలర్లలో చాహల్ ఒకడు. కానీ, ఈప్రస్తుతం అతను భారత క్రికెట్ జట్టులో భాగం కాదు. అతనికి టీం ఇండియా తలుపులు మూసుకున్నట్లే. చాహల్ చివరిసారిగా 2023 సంవత్సరంలో వన్డేలు, టీ20లలో ఆడటం కనిపించాడు. అప్పటి నుంచి సెలెక్టర్లు అతనికి ఏ సిరీస్‌లోనూ తిరిగి వచ్చే అవకాశం ఇవ్వలేదు.

ఇవి కూడా చదవండి

యుజ్వేంద్ర చాహల్ అంతర్జాతీయ కెరీర్..

యుజ్వేంద్ర చాహల్ అంతర్జాతీయ కెరీర్ గురించి చెప్పాలంటే, అతను 2016 సంవత్సరంలో టీమ్ ఇండియా తరపున తన తొలి మ్యాచ్ ఆడాడు. దాదాపు ఒక దశాబ్దం పూర్తి కానుంది. కానీ. అతను టీం ఇండియా తరపున టెస్ట్ అరంగేట్రం చేయలేకపోయాడు. ఈ కోరిక నెరవేరకుండానే రిటైర్మెంట్ చేసేలా ఉన్నాడు. 80 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 79 ఇన్నింగ్స్‌లలో 96 వికెట్లు పడగొట్టాడు. 72 వన్డే మ్యాచ్‌ల్లో 121 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..