AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకటి కాదు, రెండు కాదు.. బుడ్డోడి కోసం ఏకంగా 3 బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేశాం..: SRH కెప్టెన్ పాట్ కమ్మిన్స్

Pat Cummins Three Plans For Vaibhav Suryavanshi: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలకు రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పెద్ద అడ్డుగోడగా నిలిచాడు. మరి ప్యాట్ కమిన్స్ పన్నిన మూడు వ్యూహాల వలలో ఈ యువ కిరణం చిక్కుకుంటాడా లేక తన బ్యాటింగ్ పదునుతో హైదరాబాద్ కోటను బద్దలు కొడతాడా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

ఒకటి కాదు, రెండు కాదు.. బుడ్డోడి కోసం ఏకంగా 3 బ్రహ్మాస్త్రాలు సిద్ధం చేశాం..: SRH కెప్టెన్ పాట్ కమ్మిన్స్
Pat Cummins Three Plans For Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: May 27, 2026 | 3:17 PM

Share

Pat Cummins Three Plans For Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 సీజన్ లో నేడు జరగబోయే అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరుకు సర్వం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య న్యూ చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ చావో రేవో సమరంలో రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అడ్డుకునేందుకు తాము మూడు ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసినట్లు హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పష్టం చేశాడు.

ఆ ఒక్క ఆటగాడి కోసం ప్రత్యేక కసరత్తులు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ లో ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ పై ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించి మంచి ఊపులో ఉంది. అయితే, ప్లేఆఫ్స్ మ్యాచ్ అనేది పూర్తిగా భిన్నమైనదని, ఇక్కడ పాత రికార్డులకు విలువ ఉండదని ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా రాజస్థాన్ జట్టులోని 15 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఒంటిచేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగలడని కమిన్స్ కొనియాడాడు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ హిస్టరీలో 13 ఏళ్ల ఐరెన్ లెగ్ ప్లేయర్.. ఏ జట్టులో చేరినా ట్రోఫీకి దూరమవ్వాల్సిందే..?

ఇవి కూడా చదవండి

గత మ్యాచ్ లో వైభవ్ హైదరాబాద్ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ ఒక అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు. ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో ఉంచుకునే ఈ సారి అతని కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు కమిన్స్ తెలిపాడు. కేవలం ఒక్క వ్యూహంతోనే మైదానంలోకి దిగితే వైభవ్ లాంటి విధ్వంసకర ఆటగాడిని ఆపడం సాధ్యం కాదని, అందుకే తాము ప్లాన్-ఎ తో పాటు ప్లాన్-బి, ప్లాన్-సి లను కూడా సిద్ధం చేసుకున్నట్లు ఒక ప్రత్యేక ముఖాముఖిలో వెల్లడించాడు.

పాత విజయాలు ఇస్తాయి.. కానీ ప్రతి మ్యాచ్ కొత్తదే!

లీగ్ దశలో రాజస్థాన్‌పై సాధించిన రెండు విజయాలు తమ జట్టుకు మానసికంగా ఎంతో మేలు చేస్తాయని కెప్టెన్ అంగీకరించాడు. మన బౌలర్లు గత మ్యాచ్‌లలో ఏ విధంగా సఫలమయ్యారో ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ మైదానంలోకి అడుగుపెట్టడం సానుకూల అంశమని చెప్పాడు. అయితే, నాకౌట్ మ్యాచ్‌లలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఏ చిన్న తప్పు చేసినా టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుందని బౌలర్లను హెచ్చరించాడు.

ఇది కూడా చదవండి: IPL 2026 Winner: ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే.. ట్రోఫీ పట్టుకపోయేది మాత్రం వాళ్లే: రికీ పాంటింగ్

వైభవ్ సూర్యవంశీ గత మ్యాచ్ లో సెంచరీ చేసినప్పటికీ, కొన్ని ఓవర్ల పాటు తాము అతడిని బాగానే కట్టడి చేశామని, ఆ తప్పుల నుండి నేర్చుకుని ఈ మ్యాచ్ లో మరింత పకడ్బందీగా బౌలింగ్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

నరాలు తెగే ఉత్కంఠ.. గెలిచేది ఎవరో?

ఒకవైపు ఆస్ట్రేలియాకు ఎన్నో ప్రపంచకప్‌లు అందించి, అత్యంత చాకచక్యంగా వ్యూహాలు రచించగల మేధావి ప్యాట్ కమిన్స్.. మరోవైపు వయసుతో సంబంధం లేకుండా ప్రపంచస్థాయి బౌలర్లనే భయపెడుతున్న పసివాడు వైభవ్ సూర్యవంశీ. వీరిద్దరి మధ్య జరగబోయే ఈ మైండ్ గేమ్ నేటి మ్యాచ్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హైదరాబాద్ బౌలింగ్ దళం రాజస్థాన్ కుర్రాడిని త్వరగా అవుట్ చేస్తుందా లేదా అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇండియన్ కుర్రాళ్ల ఐడియాలకు గ్లోబల్ దిగ్గజాలు ఫిదా.. రెండో రోజు..
ఇండియన్ కుర్రాళ్ల ఐడియాలకు గ్లోబల్ దిగ్గజాలు ఫిదా.. రెండో రోజు..
'మల్లేశం'లో హీరోయిన్‌గా నన్నే తీసుకున్నారు.. కానీ: జబర్దస్త్ నటి
'మల్లేశం'లో హీరోయిన్‌గా నన్నే తీసుకున్నారు.. కానీ: జబర్దస్త్ నటి
కలవలేని ప్రేమకు.. భూమికి దిగని పక్షి.. ఆ సూపర్ హిట్ సాంగ్ అర్థం త
కలవలేని ప్రేమకు.. భూమికి దిగని పక్షి.. ఆ సూపర్ హిట్ సాంగ్ అర్థం త
40 ఏళ్లలోనూ 20ఏళ్ల వారిలా మెరిసిపోవాలా? కొరియన్ల సీక్రెట్స్ ఇవే!
40 ఏళ్లలోనూ 20ఏళ్ల వారిలా మెరిసిపోవాలా? కొరియన్ల సీక్రెట్స్ ఇవే!
భీమవరంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
భీమవరంలో eRZL హైడ్రేషన్ అవగాహన కార్యక్రమం
Multibagger Stock: లక్ష పెట్టుబడితో ఏకంగా రూ. 68 లక్షల లాభం..
Multibagger Stock: లక్ష పెట్టుబడితో ఏకంగా రూ. 68 లక్షల లాభం..
మగవారు అలర్ట్.. వేసవి లో ఈ తప్పులు చేస్తే.. ఆ శక్తికి ముప్పు..
మగవారు అలర్ట్.. వేసవి లో ఈ తప్పులు చేస్తే.. ఆ శక్తికి ముప్పు..
బంగారం Vs వెండి.. ప్రస్తుతం దేనిపై పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు
బంగారం Vs వెండి.. ప్రస్తుతం దేనిపై పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు
విజయశాంతి సరసన మొత్తం 19 సినిమాలు.. ఎన్ని బ్లాక్ బస్టర్స్..
విజయశాంతి సరసన మొత్తం 19 సినిమాలు.. ఎన్ని బ్లాక్ బస్టర్స్..
నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన సినిమా.. ఎన్టీఆర్ పోస్ట్ వైరల్
నా హృదయాన్ని హత్తుకున్న ఒక అందమైన సినిమా.. ఎన్టీఆర్ పోస్ట్ వైరల్