
Pant Scolds Kuldeep Yadav : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు కెప్టెన్ రిషబ్ పంత్‌కు సహచర ఆటగాళ్లపై, ముఖ్యంగా కుల్దీప్ యాదవ్‌పై ఆగ్రహం వచ్చింది. నువ్వు ఇంట్లో ఆడటం లేదు అంటూ పంత్ గట్టిగా అరిచాడు. టీమిండియా ఆటగాళ్లు చేసిన ఒక పొరపాటు కారణంగా అంపైర్ జట్టుకు రెండో వార్నింగ్ ఇవ్వడంతో పంత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఇప్పుడు భారత్ మరోసారి అదే తప్పు చేస్తే సౌతాఫ్రికా జట్టుకు పెనాల్టీగా 5 పరుగులు ఉచితంగా లభిస్తాయి.
రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 88వ ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. కానీ కుల్దీప్ ఫీల్డింగ్‌ను సెట్ చేయడంలో ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఓవర్ ముగిసిన తర్వాత తరువాతి ఓవర్‌ను 60 సెకన్లలోపు ప్రారంభించాలి. దీనిని ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధన అంటారు. కానీ కుల్దీప్ ఈ గడువును దాటేశాడు.
కుల్దీప్ ఆలస్యం చేస్తుండటంతో స్టంప్ మైక్‌లో పంత్ గొంతు స్పష్టంగా వినిపించింది.. టైమర్ మొదలైంది, తొందరగా బౌలింగ్ చేయి. ఇంట్లో ఆడుతున్నావా ఏంటి? అని పంత్ అరిచాడు. ఇది గత 8 ఓవర్లలో భారత జట్టు స్టాప్ క్లాక్ నిబంధనను ఉల్లంఘించడం రెండోసారి. దాంతో అంపైర్ టీమిండియాకు రెండో వార్నింగ్‌ను ప్రకటించాడు.
What's going to be a good score for #TeamIndia to chase in the 1st innings? 💬#CheteshwarPujara backs the batters to score big in Guwahati! 🏟#INDvSA 2nd Test, Day 2 LIVE NOW 👉 https://t.co/J8u4bmcZud pic.twitter.com/vGjwWPopSm
— Star Sports (@StarSportsIndia) November 23, 2025
ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధన అంటే ఏమిటి?
క్రికెట్ మ్యాచ్‌లలో అనవసరంగా సమయాన్ని వృథా చేయకుండా నిరోధించడానికి ఐసీసీ ఈ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. టెస్ట్ క్రికెట్‌లో ఒక ఓవర్ పూర్తయిన తర్వాత ఫీల్డింగ్ జట్టు 60 సెకన్లలోపు తదుపరి ఓవర్‌ను ప్రారంభించాలి. ఈ సమయాన్ని మించితే అంపైర్ మొదట జట్టుకు వార్నింగ్ ఇస్తారు. రెండుసార్లు వార్నింగ్ ఇచ్చిన తర్వాత మూడోసారి తప్పు జరిగితే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు పెనాల్టీగా ఇస్తారు.
ఈ వార్నింగ్‌లు ప్రతి 80 ఓవర్లకు ఒకసారి మళ్లీ రీసెట్ అవుతాయి. అంటే 80 ఓవర్ల తర్వాత మళ్లీ కొత్తగా రెండు వార్నింగ్‌లు ఇస్తారు. ఇదే తరహా నిబంధన బ్యాట్స్‌మెన్‌లకు కూడా వర్తిస్తుంది. ఒక బ్యాట్స్‌మన్ అవుట్ అయిన తర్వాత కొత్త బ్యాట్స్‌మన్ 3 నిమిషాల్లోపు మొదటి బంతిని ఆడాలి. లేకపోతే టైమ్డ్ అవుట్ రూపంలో అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..