
Sarfaraz Ahmed: క్రికెట్ అనేది సాహసంతో కూడిన గేమ్. అయితే కొన్నిసార్లు అది కాస్త ప్రమాదకరంగా కూడా మారుతుంది. కొలంబో వేదికగా పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులోనూ అలాంటిదే కనిపించింది. శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో పాకిస్థాన్ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ప్రమాదంలోకి నెట్టాడు. దీంతో మ్యాచ్ మధ్య నుంచే తప్పుకోవాల్సి వచ్చింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ 81వ ఓవర్లో బంతి హెల్మెట్‌కు తగిలింది. దాని ప్రభావం 5 ఓవర్ల తర్వాత అంటే 86వ ఓవర్‌లో కనిపించింది. దీంతో సర్ఫరాజ్ అహ్మద్ మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ 86వ ఓవర్ ముగిసే సమయానికి సర్ఫరాజ్ అహ్మద్ తల తిరుగుతున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఫిజియో మైదానానికి వచ్చాడు. సర్ఫరాజ్‌ను మైదానంలో పరీక్షలు చేశాడు. అతనితో మాట్లాడి, ఆ తర్వాత విషయం కొంత గందరగోళంగా మారడంతో సర్ఫరాజ్‌ను తనతో పాటు తీసుకొని మైదానం వెలుపలికి వెళ్లాడు. సర్ఫరాజ్ అహ్మద్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. ఆసయంలో సర్ఫరాజ్ 22 బంతుల్లో 14 పరుగులతో ఆడుతున్నాడు.
Sarfaraz Ahmed retired hurt on 14 runs due to a possible concussion after the ball struck on his head#PAKvSL #SLvPAK #Sarfaraz pic.twitter.com/v07SSmyoXZ
— Shakeel Khan Khattak (@ShakeelktkKhan) July 26, 2023
సర్ఫరాజ్ అహ్మద్ ఖచ్చితంగా 86వ ఓవర్ ముగిసే సమయానికి మైదానం నుంచి బయటకు వెళ్లాడు. అయితే పాకిస్థాన్ ఇన్నింగ్స్ 81వ ఓవర్ నాలుగో బంతికి ఈ గాయం ఇబ్బందిగా అనిపించింది. సర్ఫరాజ్ తలకు తగిలిన బంతి అతని హెల్మెట్‌కు తగిలి లెగ్-బై నుంచి పాకిస్తాన్ 4 పరుగులు తీసుకొచ్చింది. గాయం తర్వాత సర్ఫరాజ్ 5 ఓవర్ల పాటు మైదానంలో నిలబడ్డాడు. కానీ, ఆ తర్వాత అతని కళ్ల ముందు చీకట్లు కమ్ముకున్నాయి.
బంతి హెల్మెట్‌కు తగలడంతో సర్ఫరాజ్ తల వెనుక భాగంలో గాయమైంది. ప్రస్తుతం అతను చికిత్స కోసం మైదానం వెలుపల ఉన్నాడు. విషయం మరీ సీరియస్‌గా లేదని, అంతా బాగానే ఉందని ఇరుజట్లు ఆశిస్తున్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే, సర్ఫరాజ్ పాకిస్థాన్ తరపున మళ్లీ బ్యాటింగ్ చేయగలడు. అతను వదిలిపెట్టిన ప్రదేశం నుంచి తన బ్యాటింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..