AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: 10 ఏళ్ల తర్వాత లక్కీ ఛాన్స్.. వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ప్లేయర్.. రోహిత్ కెప్టెన్సీలోనైనా కలిసొచ్చేనా?

India vs West Indies: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు జులై 27, 29 తేదీల్లో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనున్నాయి. మూడో వన్డే ఆగస్టు 1న ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరగనుంది.

IND vs WI: 10 ఏళ్ల తర్వాత లక్కీ ఛాన్స్.. వన్డే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ప్లేయర్.. రోహిత్ కెప్టెన్సీలోనైనా కలిసొచ్చేనా?
Team India
Venkata Chari
|

Updated on: Jul 26, 2023 | 4:07 PM

Share

India vs West Indies 1st ODI: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు జులై 27, 29 తేదీల్లో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనున్నాయి. మూడో వన్డే ఆగస్టు 1న ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరగనుంది. ఈ వన్డే సిరీస్ భారత ఆటగాడికి చాలా ప్రత్యేకమైనదిగా మారింది. ఈ ఆటగాడు 10 ఏళ్ల తర్వాత టీమిండియా తరఫున వన్డే మ్యాచ్‌ ఆడడం చూడొచ్చు. తాజాగా ఈ ఆటగాడికి టెస్టు సిరీస్‌లో కూడా ఆడే అవకాశం లభించింది.

పదేళ్ల తర్వాత వన్డే ఆడే అవకాశం..

వెస్టిండీస్‌తో ఇటీవల ఆడిన టెస్ట్ సిరీస్‌లో ఫ్లాప్ అయిన 31 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌కు ఈ వన్డే సిరీస్ చాలా ప్రత్యేకమైనది. జయదేవ్ ఉనద్కత్ 10 ఏళ్లుగా టీమ్ ఇండియా తరపున ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. ఉనద్కత్ తన చివరి వన్డేను 2013లో వెస్టిండీస్‌తో కొచ్చిలో ఆడాడు. అదే సమయంలో, అతను IPL 2023కి ముందు ఆస్ట్రేలియాతో ఆడిన ODI సిరీస్‌లో కూడా ఎంపికయ్యాడు. కానీ, అతను ప్లేయింగ్ 11లో భాగం కాలేకపోయాడు.

12 ఏళ్ల తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి..

జయ్‌దేవ్ ఉనద్కత్ గతేడాది భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. అంతకుముందు, 2010 సంవత్సరంలో అతను సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తరపున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. జయదేవ్ ఉనద్కత్ భారత్ తరపున 7 వన్డేల్లో 8 వికెట్లు, 10 టీ20ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అతను తన పేరు మీద 4 టెస్ట్ మ్యాచ్‌లలో 3 వికెట్లు సాధించాడు.

ఇవి కూడా చదవండి

వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, R జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్.

IND vs WI ODI సిరీస్ షెడ్యూల్-

1వ ODI, జులై 27, బార్బడోస్

2వ ODI, జులై 29, బార్బడోస్

3వ ODI, ఆగస్టు 1, ట్రినిడాడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..