టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఆదివారం, అంటే నవంబర్ 13 న జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ఆస్ట్రేలియన్ వాతావరణ సూచన ప్రకారం, మెల్‌బోర్న్‌లో ఆదివారం 100%, రిజర్వ్ డే సోమవారం 95% వర్షం పడే అవకాశం ఉంది. గాలి వేగం కూడా గంటకు 35 కిలోమీటర్లు దాటవచ్చని తెలిపింది. ఇక ఫైనల్ రోజు వర్షం నేపథ్యంలో ఐసీసీ రిజర్వ్ డేని కూడా ఉంచింది. ఇటువంటి పరిస్థితిలో వర్షం నవంబర్ 13 ఆదివారం సమస్యలను సృష్టిస్తే, ఈ మ్యాచ్ నవంబర్ 14 న ఆడవచ్చు. అయితే నవంబర్ 14న కూడా మెల్‌బోర్న్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ ఎలా ముగుస్తుందనే అసక్తి క్రీడాభిమానుల్లో నెలకొంది.
ఇటువంటి పరిస్థితిలో ఐసీసీ శనివారం కొత్త షరతులను జారీ చేసింది. రిజర్వ్-డే అదనపు ఆట సమయాన్ని 2 నుంచి 4 గంటలకు తగ్గించింది. అయితే, రెండు రోజుల్లో వర్షం అంచనా సరైనదని తేలితే, ఫైనల్‌ను రద్దు అవుతుంది. ఇదే జరిగితే, ఇంగ్లండ్-పాకిస్తాన్ ట్రోఫీని పంచుకోవలసి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే, పాకిస్తాన్, ఇంగ్లండ్ జాయింట్ విజేతలుగా ప్రకటించనున్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో ఎక్కువ వర్షం రావడానికి కారణం ‘లా నినా’ తుఫాన్. బ్యూరో ఆఫ్ మెటియోరాలజీ ‘లా నినా’ ఎఫెక్ట్‌తో ఆస్ట్రేలియాలో ఎక్కువ వర్షాలు పడుతున్నాయని చెప్పుకొచ్చింది. దీని వల్ల ఈ ఏడాది సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న భూమధ్యరేఖ ప్రాంతం చుట్టూ సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం వల్లే ఇలా జరుగుతోందని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. ఈ సంవత్సరం వాతావరణ చక్రంలో మార్పు ప్రభావం ఇక్కడ కనిపించడం ప్రారంభించిందని తెలిపింది.
ఈ ప్రపంచకప్‌లో సూపర్ 12 దశకు చెందిన 3 మ్యాచ్‌లు మెల్‌బోర్న్‌లో వర్షం కారణంగా రద్దయ్యాయి. అవి న్యూజిలాండ్ vs ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ vs ఐర్లాండ్, ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ మ్యాచ్‌లు. ఇంగ్లండ్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా ప్రభావితమైంది. అయితే ఇక్కడ డక్‌వర్త్ లూయిస్ కారణంగా ఐర్లాండ్ గెలిచింది.
గ్రూప్ దశలో ప్రతి మ్యాచ్‌కు ఇరు జట్లకు కనీసం తలో 5 ఓవర్లు ఆడాలని నిర్ణయించారు. నాకౌట్‌లో ఇరు జట్లు కనీసం తలో 10 ఓవర్లు ఆడాల్సి ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..