- Telugu News Sports News Cricket news Pakistan player Saud Shakeel joins Sachin Tendulkar, Sehwag elite list check full details
SL vs PAK: ఎలైట్ లిస్టులో చేరిన పాక్ బ్యాటర్.. భారత్ నుంచి ఇద్దరే.. అదేంటంటే?
Saud Shakeel: శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన తొలి పాకిస్థానీ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే ఈ డబుల్ సెంచరీతో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల ప్రత్యేక విజయాన్ని సమం చేశాడు.
Updated on: Jul 19, 2023 | 8:15 AM

Saud Shakeel: గాలే అంతర్జాతీయ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్ డబుల్ సెంచరీ సాధించాడు. 361 బంతులు ఎదుర్కొన్న సౌద్ 19 ఫోర్లతో అజేయంగా 208 పరుగులు చేశాడు.

దీంతో శ్రీలంక గడ్డపై డబుల్ సెంచరీ చేసిన తొలి పాక్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అలాగే ఈ డబుల్ సెంచరీతో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల ప్రత్యేక విజయాన్ని సమం చేశాడు.

అంటే శ్రీలంకలో టెస్టు క్రికెట్‌లో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే డబుల్ సెంచరీ సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో నాలుగో బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ చేరాడు.

2008లో గాలే టెస్టులో శ్రీలంకపై భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 208 పరుగులు చేశాడు.

2010లో కొలంబో టెస్టులో సచిన్ టెండూల్కర్ 203 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సొంతగడ్డపై లంకపై డబుల్ సెంచరీ సాధించిన ఆసియా బ్యాట్స్‌మెన్‌గా సచిన్-సెహ్వాగ్ రికార్డులకెక్కారు.

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఆతిథ్య శ్రీలంకపై టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన 3వ ఆసియా బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ నిలిచాడు.

శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన ప్రపంచంలో 4వ బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు వీరేంద్ర సెహ్వాగ్ (208), సచిన్ టెండూల్కర్ (203), జో రూట్ (228) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో సౌద్ షకీల్ కూడా చేరాడు.




