SL vs PAK: ఆడింది 6 టెస్టులే.. 50+ స్కోర్లతో సంచలనం.. కట్‌చేస్తే.. తొలి డబుల్ సెంచరీతో సరికొత్త చరిత్ర..
Sri Lanka vs Pakistan: సౌద్ షకీల్ డబుల్ సెంచరీ సాయంతో పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసిన శ్రీలంక జట్టు 149 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.
Saud Shakeel: గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు యువ పేసర్ సౌద్ షకీల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ డబుల్ సెంచరీతో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ డబుల్ సెంచరీతో సౌద్ షకీల్ శ్రీలంకలో డబుల్ సెంచరీ చేసిన తొలి పాక్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అంతకుముందు శ్రీలంకలో మహ్మద్ హఫీజ్ చేసిన 196 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. ఇప్పుడు సౌద్ షకీల్ అజేయంగా 208 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు.
- అలాగే పాకిస్థాన్ తరపున డబుల్ సెంచరీ చేసిన 23వ బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ నిలిచాడు.
- టెస్టు క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సౌద్ షకీల్ తొలి 11 టెస్టు ఇన్నింగ్స్‌ల తర్వాత పాకిస్థాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం షకీల్ మొత్తం 788 పరుగులు చేశాడు.
- తొలి విదేశీ టెస్టు సిరీస్‌లో డబుల్ సెంచరీ సాధించిన రెండో పాక్ బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ నిలిచాడు. దీనికి ముందు జహీర్ అబ్బాస్ 1971లో ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఈ ప్రత్యేక రికార్డును లిఖించిన 2వ పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌గా సౌద్ షకీల్ నిలిచాడు.
- తొలి 6 టెస్టు మ్యాచ్‌ల్లో 50+ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సౌద్ షకీల్ కూడా చేరాడు. సునీల్ గవాస్కర్, బాసిల్ బుట్చర్, సయీద్ అహ్మద్, బర్ట్ సట్‌క్లిఫ్ మాత్రమే ఇంతకు ముందు ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు. ఇప్పుడు ఈ జాబితాలో ఐదో బ్యాటర్‌గా సౌద్ షకీల్ చేరాడు.
- రెండేళ్లలో టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ. దీనికి ముందు 2021లో జింబాబ్వేపై అబిద్ అలీ 215 పరుగులు చేశాడు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత సౌద్ షకీల్ పాకిస్థాన్ తరపున డబుల్ సెంచరీ సాధించాడు.
సౌద్ షకీల్ డబుల్ సెంచరీ సాయంతో పాక్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసిన శ్రీలంక జట్టు 149 పరుగులు వెంకంజలో నిలిచి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..