AUS vs PAK: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్ అద్భుతంగా పునరాగమనం చేసి, వరుసగా 2 మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో 22 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై పాక్ వన్డే సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. నిజానికి, ఈ సిరీస్‌కు ముందు, మహ్మద్ రిజ్వాన్‌ను పాకిస్తాన్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమించారు. రిజ్వాన్ ఇప్పుడు కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో రికార్డు విజయం సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం మాట్లాడిన రిజ్వాన్ పాకిస్థాన్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం మాట్లాడిన రిజ్వాన్ తన ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. ఈ చారిత్రాత్మక సిరీస్ విజయం నాకు చాలా ప్రత్యేకమైన క్షణం అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజు దేశం మొత్తం సంబరాలు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా మా జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కానీ, ఇప్పుడు జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. నేను కొత్త కెప్టెన్‌ని అయినప్పటికీ, టాస్, ప్రదర్శనకు మాత్రమే నేను కెప్టెన్‌ని. అంతేకాకుండా, ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ గురించి ప్రతి ఆటగాడు నాకు సలహా ఇస్తుంటాడు. ఈ విజయం సాధించిన ఘనత పాక్ బౌలర్లదేనని చెప్పుకొచ్చాడు.
పెర్త్‌లో జరిగిన చివరి వన్డేలో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ ఎంపికను సమర్థిస్తూ పాక్ బౌలర్లు మరోసారి ఆసీస్ బ్యాటింగ్ విభాగాన్ని చిత్తు చేశారు. పాక్ పేసర్ల ధాటికి ఉలిక్కిపడిన ఆసీస్ జట్టు కేవలం 31.5 ఓవర్లలోనే అన్ని వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆసీస్ తరపున సీన్ అబాట్ అత్యధికంగా 30 పరుగులు చేసినప్పటికీ, మిగిలిన బ్యాట్స్‌మెన్ రాణించలేకపోయారు. పాక్ బౌలింగ్‌లో రాణించిన షాహీన్, నసీమ్ చెరో 3 వికెట్లు తీయగా, హరీస్ రవూఫ్ 7 ఓవర్లలో 24 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు.
140 పరుగుల స్వల్ప స్కోరును ఛేదించిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, సామ్ అయూబ్ 84 పరుగులతో పటిష్టమైన ఆరంభాన్ని అందించారు. కానీ, ఆ తర్వాత ఓపెనర్లిద్దరూ కేవలం 1 పరుగు తేడాతో ఔటయ్యారు. షఫీక్ 37 పరుగులు, సామ్ 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం 26.5 ఓవర్లలో బాబర్ అజామ్ 28 పరుగులు, కెప్టెన్ రిజ్వాన్ 30 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..