Pakistan: ‘మైండ్ యువర్ ఓన్ బిజినెస్’.. పీసీబీ అధ్యక్షుడిపై షాహిద్ అఫ్రిది ఫైర్.. రోజుకో మలుపు తిరుగుతోన్న వాట్సప్ చాట్ లీక్..
PCB Chief Zaka Ashraf: మీ పనిపై దృష్టి పెట్టండి. జట్టు ప్రపంచకప్ ఆడుతున్నప్పుడు మీరు ఆటగాళ్ల గురించి జట్టు కెప్టెన్ గురించి ప్రకటనలు చేస్తున్నారు. మొదట మీరు మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి. క్రికెటర్లుగా మేం మీ నుంచి ఆశించేది ఇదే. ప్రజలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాటిని పక్కన పెట్టి, మీరు వారికి మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. దయచేసి మీ పని ఏంటో మీరు చూసుకోండి అంటూ జకా అష్రాఫ్‌పై అఫ్రిది విరుచుకుపడ్డాడు.

Pakistan Cricket Team: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, పీసీబీ అధ్యక్షుడు జాకా అష్రఫ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ కేసు పాకిస్థాన్ క్రికెట్‌లో పెను దుమారం రేపడమే కాకుండా రోజురోజుకు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ బోర్డు ప్రెసిడెంట్ జాక్ అష్రాఫ్ ఈ చర్యపై పాక్ జట్టు మాజీ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అతని లైన్‌లో జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) కూడా చేరాడు. జకా అష్రాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని, కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ వ్యవహారం సరికొత్త మలుపులు తిరుగుతోంది.
అష్రఫ్ ఏదో ఒక క్లబ్ ప్రెసిడెంట్ కాదు..
దీనిపై ఓ పాక్ టీవీ కార్యక్రమంలో మాట్లాడిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. ‘జకా అష్రఫ్ ఏదో క్లబ్‌కు అధ్యక్షుడు కాదు. అతను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు. వారు చాలా విషయాలు గమనించాలి. అష్రఫ్ స్వయంగా మీడియా హౌస్‌ల యజమానులకు ఫోన్ చేసి వాట్సాప్ మెసేజ్‌లను బహిర్గతం చేయమని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించింది’.
మీ పనిపై దృష్టి పెట్టండి..
— Sports Ka SULTAN (@SportsKaSultan_) October 31, 2023
అఫ్రిదీ మాట్లాడుతూ.. మీ పనిపై దృష్టి పెట్టండి. జట్టు ప్రపంచకప్ ఆడుతున్నప్పుడు మీరు ఆటగాళ్ల గురించి జట్టు కెప్టెన్ గురించి ప్రకటనలు చేస్తున్నారు. మొదట మీరు మీ గౌరవాన్ని నిలబెట్టుకోండి. క్రికెటర్లుగా మేం మీ నుంచి ఆశించేది ఇదే. ప్రజలు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాటిని పక్కన పెట్టి, మీరు వారికి మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. దయచేసి మీ పని ఏంటో మీరు చూసుకోండి అంటూ జకా అష్రాఫ్‌పై అఫ్రిది విరుచుకుపడ్డాడు.
వివాదం ఏమిటి?
Shameful act done by @ARYNEWSOFFICIAL by leaking Babar Azam private WhatsApp messages on national tv. I agree on the manager conflict of interest bit but doing this is utter shameful act expected better from Mr Waseem badmi.@WaseemBadamipic.twitter.com/6Y0chDPXjH
— Mustafa (@Mustafasays_) October 29, 2023
ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ ఓటమి తర్వాత, బాబర్ ఆజం, పీసీబీ ఛైర్మన్ జకా అష్రఫ్ మధ్య వ్యవహారం బాగోలేదు. మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఒక టీవీ చర్చలో మాట్లాడుతూ, కెప్టెన్ బాబర్ నుంచి పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ ఎటువంటి కాల్స్ తీసుకోవడం లేదని అన్నారు. ఈ ప్రకటన తర్వాత క్రికెట్ సర్కిల్‌లో పెద్ద చర్చ మొదలైంది.
దీనిపై స్పందించిన జాకా అష్రఫ్ ఓ పాకిస్థానీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తలను ఖండించారు. ‘‘బాబర్ నన్ను ఎప్పుడూ నేరుగా సంప్రదించలేదు. అతను సాధారణంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేదా ఇంటర్నేషనల్ క్రికెట్ డైరెక్టర్‌తో మాట్లాడతాడు” అని అష్రాఫ్ అన్నారు. తన ప్రకటనకు అనుబంధంగా, అతను మీడియా ముందు బాబర్, పీసీబీ సీఓఓ మధ్య వాట్సాప్ చాట్‌ను వెల్లడించాడు.
చాట్‌లో ఏముంది?
పీసీబీ సీఓఓ సల్మాన్ నసీర్, బాబర్‌లు నిర్వహించిన వాట్సాప్ చాట్‌లో ‘బాబర్.. మీరు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పంపినా అష్రఫ్ స్పందించడం లేదని టీవీ, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అతనికి ఫోన్ చేశావా?’ అంటూ నసీర్ బాబర్‌ని అడిగాడు. ‘సలాం సల్మాన్ భాయ్, నేను అష్రఫ్‌కి ఫోన్ చేయలేదు సార్..’ అంటూ బాబర్ బదులిచ్చాడని ఆ చాట్‌లో పేర్కొన్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..