Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NZ vs SA Playing XI: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. 24 ఏళ్ల ప్రతీకారానికి సిద్ధమైన సౌతాఫ్రికా.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

New Zealand vs South Africa Playing XI: నాలుగేళ్ల తర్వాత ఇరు జట్లు వన్డేల్లో తలపడనున్నాయి. చివరిసారిగా ఇరుజట్లు 2019 ప్రపంచకప్‌లో తలపడ్డారు. టోర్నీలో 25వ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో జరిగింది. ఇందులో న్యూజిలాండ్ చివరి ఓవర్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెంచరీ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

NZ vs SA Playing XI: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. 24 ఏళ్ల ప్రతీకారానికి సిద్ధమైన సౌతాఫ్రికా.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..
Nz Vs Sa Toss
Follow us
Venkata Chari

|

Updated on: Nov 01, 2023 | 1:45 PM

ICC Men’s ODI world cup New Zealand vs South Africa Playing XI: వన్డే ప్రపంచకప్ 2023లో 32వ మ్యాచ్‌లో ప్రస్తుత రన్నరప్ న్యూజిలాండ్ నేడు దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (ఎంసీఏ)లో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో గెలుపొందిన జట్టు సెమీఫైనల్‌కు సులువుగా అర్హత సాధిస్తుంది. న్యూజిలాండ్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి 8 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా 6 మ్యాచ్‌ల్లో 5 గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

రెండు జట్లకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఓసారి గమనిస్తే.. 1999 నుంచి ప్రపంచ కప్‌లో ఇరుజట్ల మధ్య 5 మ్యాచ్‌లు జరిగాయి. మొత్తం ఐదు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ గెలిచింది. వీటిలో 2011, 2015 ప్రపంచకప్‌లో 2 నాకౌట్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 71 వన్డేలు జరిగాయి. న్యూజిలాండ్ 25 మ్యాచ్‌లు గెలవగా, దక్షిణాఫ్రికా 41 మ్యాచ్‌లు గెలిచింది. 5 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

అయితే, ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇరు జట్లు ఇప్పటి వరకు 8 సార్లు తలపడగా, న్యూజిలాండ్ 6, దక్షిణాఫ్రికా 2 మాత్రమే గెలిచాయి.

నాలుగేళ్ల తర్వాత ఇరు జట్లు తలపడనుండగా..

View this post on Instagram

A post shared by ICC (@icc)

నాలుగేళ్ల తర్వాత ఇరు జట్లు వన్డేల్లో తలపడనున్నాయి. చివరిసారిగా ఇరుజట్లు 2019 ప్రపంచకప్‌లో తలపడ్డారు. టోర్నీలో 25వ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో జరిగింది. ఇందులో న్యూజిలాండ్ చివరి ఓవర్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సెంచరీ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఇరు జట్లు:

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎన్గిడి.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..