Pakistan Cricket Team: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అయితే, ప్రతి ఆటగాడితోపాటు ఆజట్టు ఫ్యాన్స్ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. బ్యాట్స్‌మెన్‌గానీ, బౌలర్లుగానీ పరుగులు చేయలేకపోతున్నారు. ఈ రెండు డిపార్ట్‌మెంట్లతో పాటు ఫీల్డింగ్‌లో పాక్ జట్టు కూడా దీనస్థితిలో ఉండటంతో మెల్‌బోర్న్‌లో నాలుగో రోజు షాన్ మసూద్ జట్టు పరువు పోగోట్టుకుంది. పాకిస్తాన్ జట్టు తమ పేలవమైన ఫీల్డింగ్ కారణంగా ఆస్ట్రేలియాకు బౌండరీ లేకుండానే 5 పరుగులు ఇచ్చారు. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుంటే, నవ్వుకుంటారంతే.
ఆట నాల్గవ రోజు, పాట్ కమిన్స్ అమీర్ జమాల్ బంతిని కవర్స్ వైపు షాట్ ఆడాడు. బంతి గ్యాప్‌లోకి వెళ్లడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు రెండు పరుగులు చేశారు. కానీ, ఫీల్డర్ విసిరిన త్రోను నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఫీల్డర్ క్యాచ్ పట్టలేకపోయాడు. బంతి బౌండరీ లైన్ వైపు కదలడం ప్రారంభించింది. ఇమామ్ ఉల్ హక్ బంతిని వెంబడించి, అతను వెనక్కి విసిరే సమయానికి, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్స్ 3 పరుగులు తీశారు. ఈ విధంగా ఆస్ట్రేలియాకు ఐదు పరుగులు వచ్చాయి.
Have you seen this before? An all-run FIVE (with help from overthrows, of course)! #AUSvPAK pic.twitter.com/gHxwJih45d
— cricket.com.au (@cricketcomau) December 29, 2023
పాకిస్థాన్ ఫీల్డింగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్ మూడు క్యాచ్‌లను జారవిడిచి తన జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. ముఖ్యమైన సందర్భాల్లో క్యాచ్‌లు వదిలేయడం నిజంగా పాక్ జట్టుకు చాలా నష్టాన్ని మిగిల్చింది. పెర్త్‌లో ఓడిపోయిన పాక్ జట్టు మెల్‌బోర్న్‌లోనూ ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణం.
ఈ టెస్టులో ఆస్ట్రేలియా 79 పరుగుల తేడాతో విజయం సాధించగా, మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కూడా కైవసం చేసుకుంది. మెల్‌బోర్న్‌లో, ఆస్ట్రేలియా పాకిస్తాన్‌కు 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దానికి ప్రతిస్పందనగా పాక్ జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 237 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ 264 పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 262 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..