Pakistan Cricket Team: పాకిస్తాన్ క్రికెట్ పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆడుతున్న తాజా మ్యాచ్‌ల్లో చేసిన ప్రదర్శనపై ఇప్పుడు ప్రపంచ క్రికెటర్లు చర్చించుకుంటున్నారు. దారుణ స్థితికి పాకిస్తాన్ క్రికెట్ టీం చేరుకుంది. సొంత గడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతి దారుణంగా రెండు టెస్టుల్లోనూ ఓడిపోయింది. సొంతగడపై ఘోరమైన ప్రదర్శన చేస్తున్న పాకిస్తాన్ క్రికెట్ టీంను ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం దూషిస్తున్నారు.
59 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ క్రికెట్ టీం ఈ స్థాయిలో ఘోర పరాభవాన్ని ఎదురుచూసింది. సాధారణంగా పాకిస్తాన్ సొంత గడ్డపై ఆ జట్టుకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే, అనూహ్యంగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌లోనూ పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలవగా.. మరో మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ గెలుపొందింది. అయితే, ఈ పరిస్థితులు ఎదురయ్యేందుకు కొన్ని కారణాలను మాజీ క్రికెటర్లు చూపిస్తున్నారు.
పాకిస్తాన్ క్రికెట్లో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నప్పటికీ వారిని వినియోగించుకోవడంలో టీం కెప్టెన్ విఫలమవుతున్నారు. మొన్నటి వరకు పాకిస్తాన్ క్రికెట్ టీంకు బాబర్ అజాం కెప్టెన్‌గా ఉన్నప్పటికీ స్పిన్నర్లను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. బాబర్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో జట్టులో స్పిన్నర్‌లో ఉన్నప్పటికీ వారిని తుది టీమ్‌లో ఆడించేవాడు కాదు. ఇప్పుడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సైతం ఇదే వాదన తెస్తున్నాడు. పాకిస్తాన్ క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లను ఉపయోగించినప్పుడే ఆ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంటుందంటూ ఆయన తెలిపాడు.
అయితే, కొద్ది నెలలుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. టీ20 వరల్డ్ కప్‌లోను స్పిన్నర్లను సరిగా ఉపయోగించుకోలేదని అంటున్నారు. ఇక సొంత గడ్డపై జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌లో వరుసగా పాకిస్తాన్ ఓడిపోవడంతో ఆ దేశ అభిమానులతో పాటు క్రికెట్ లోకం సైతం ఆశ్చర్యానికి గురైంది. అత్యుత్తమ పేసర్లు కలిగి ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు స్పిన్నర్లపై ఫోకస్ చేయకపోవడం ఘోరమైన తప్పిదమని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..