Babar Azam: పెళ్లికి సిద్ధమైన పాక్ కెప్టెన్.. భారత్‌లో షాపింగ్.. లక్షలు ఖర్చు చేసి ఏం కొన్నాడంటే?

|

Nov 04, 2023 | 10:07 AM

World Cup 2023: ప్రస్తుతం బాబర్ ఫ్యాన్స్‌కు ఈ వార్త సంతోషాన్ని కలిగించకపోవచ్చు. అందుకు గల కారణాలు కూడా ఉన్నాయి. ఈ వార్త బాబర్‌కు కూడా మరింత సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే 2023 ప్రపంచకప్‌లో బాబర్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. దీని కారణంగా సెమీఫైనల్ చేరడం జట్టుకు కష్టంగా కనిపిస్తోంది.

Babar Azam: పెళ్లికి సిద్ధమైన పాక్ కెప్టెన్.. భారత్‌లో షాపింగ్.. లక్షలు ఖర్చు చేసి ఏం కొన్నాడంటే?
Babar Azam
Follow us on

Babar Azam’s Marriage: బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడుతోంది. కాగా, పాక్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే దశలో ఉంది. అయితే ఇంతలో బయటకు వచ్చిన మీడియా నివేదికలు మాత్రం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ప్రపంచ కప్ తర్వాత బాబర్ ఆజం వివాహం చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం భారతదేశంలో షాపింగ్ చేయడం ప్రారంభించాడంట.

‘వన్ క్రికెట్’లో వచ్చిన కథనం ప్రకారం, బాబర్ ఆజం తన పెళ్లి కోసం భారతదేశపు ప్రముఖ డిజైనర్ సబ్యసాచి నుంచి రూ. 7 లక్షల విలువైన షేర్వానీని కొనుగోలు చేశాడంట. బాబర్ అజామ్ ఈ ఏడాది చివరి నాటికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని, దీని కోసం అతను ప్రపంచ కప్ మధ్య విరామాన్ని భారతదేశంలో షాపింగ్ చేయడానికి ఉపయోగిస్తున్నాడని నివేదికలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం, బాబర్ పెళ్లి వార్త ఫ్యాన్స్‌కు సంతోషాన్ని కలిగించకపోవచ్చు. అందుకు గల కారణాలు కూడా ఉన్నాయి. ఈ వార్త బాబర్‌కు మరింత సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే 2023 ప్రపంచకప్‌లో బాబర్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. దీని కారణంగా సెమీఫైనల్ చేరడం జట్టుకు కష్టంగా కనిపిస్తోంది. టోర్నమెంట్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన తరువాత, భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా టీంలపై వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. అయితే దీని తర్వాత ఏడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆ జట్టు మూడో విజయాన్ని అందుకుంది.

బాబర్ ఆజం విఫలం..

ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఇప్పటివరకు 7 మ్యాచ్‌లలో 7 ఇన్నింగ్స్‌లలో 3 అర్ధ సెంచరీలతో సహా 216 పరుగులు చేశాడు. బాబర్ యాభై పరుగులు చేసిన మూడు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ ఓటమిని చవిచూసింది. టోర్నీలో ఇప్పటివరకు కెప్టెన్ బాబర్ అత్యధిక స్కోరు 74 పరుగులుగా నిలిచింది. జట్టు తరుపున పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు.

పాకిస్థాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, సౌద్ షకీల్, అఘా సల్మాన్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, ఇమామ్-ఉల్- హక్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..