గాలె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన బాబర్ ఆజం(Babar Azam), రెండో ఇన్నింగ్స్‌లో కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ, ఈసారి బాబర్‌ను శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య భారీ ఇన్నింగ్స్ ఆడకుండా ఆపేశాడు. బాబర్ రెండవ ఇన్నింగ్స్‌లో కూడా మంచి లయలో కనిపించాడు. అతనిని అవుట్ చేయడానికి ప్రత్యేక బౌలింగ్ అవసరం. ఈ మేరకు శ్రీలంక స్పిన్నర్ కూడా అలాంటిదే చేశాడు. ప్రభాత్ జయసూర్య బాబర్ అజామ్‌ను ఔట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను ఎలా బోల్డ్ అయ్యాడో బాబర్‌కే తెలియకుండా జరిగిపోయింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.
పాక్ ఇన్నింగ్స్ 79వ ఓవర్‌లో బాబర్ ఔటయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ జయసూర్యను ఆపే ప్రయత్నంలో బాబర్ అజామ్ వికెట్ పడిపోయింది. జయసూర్య లెగ్-స్టంప్‌పై పడిన బంతిని తన పాదాలతో ఆపడానికి బాబర్ ప్రయత్నించాడు. కానీ బంతి అతని వెనుక నుంచి వికెట్‌ను పడగొట్టింది. జయసూర్య వేసిన ఈ బాల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గాలే టెస్టు గురించి మాట్లాడితే.. పాకిస్థాన్‌కు 342 పరుగుల విజయ లక్ష్యం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 3 వికెట్లకు 222 పరుగులు చేసింది. అసద్ షఫీక్ అద్భుత సెంచరీతో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బాబర్ ఆజం 55 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇమామ్ 35 పరుగులు చేశాడు. కేవలం 6 పరుగుల వద్ద అజహర్ అలీ ఔటయ్యాడు.
— Bleh (@rishabh2209420) July 19, 2022
చివరి రోజు శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంటుందా?
గాలే టెస్టులో ఐదో రోజు చాలా ఉత్కంఠగా సాగనుంది. చివరి రోజు పాకిస్థాన్‌కు ఇంకా 120 పరుగులు చేయాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో జయసూర్య 2, రమేష్ మెండిస్ ఒక వికెట్ తీశారు. ఆఖరి రోజు స్పిన్నర్లకు భారీ సహకారం అందుతుందని భావించినందున గాలె టెస్టులో ఏ జట్టు గెలుస్తుందో ఊహించడం కష్టం. బాబర్ అజామ్ వికెట్ పడగొట్టిన తర్వాత శ్రీలంక విజయంపై ఆశలు చిగురించాయి. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేసిన బాబర్ అజామ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శ్రీలంక జట్టుకు ప్రమాదకరంగా నిలిచాడు. కానీ, జయసూర్య స్పిన్ అతనిని అడ్డుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన జయసూర్య నుంచి శ్రీలంక ఎక్కువగా ఆశలు పెట్టుకుంది.