Bouncer: తొలి మ్యాచ్ లోనే బౌన్సర్లతో బ్యాట్స్ మెన్ హెల్మెట్ ఎగరగొట్టిన పాకిస్తాన్ బౌలర్.. షాక్ తో వణికిన జింబాబ్వే బ్యాట్స్ మేన్

అంతర్జాతీయ క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లు వేసే బౌన్సర్లు ఎదుర్కోవడం చాలా కష్టమైన పని. వాటిని ఎదుర్కుని బ్యాట్ తొ బదులివ్వడం కష్టం.. అలా అని వదిలేస్తే దెబ్బలు తగిలే చాన్సూ ఉంటుంది.

Bouncer: తొలి మ్యాచ్ లోనే బౌన్సర్లతో బ్యాట్స్ మెన్ హెల్మెట్ ఎగరగొట్టిన పాకిస్తాన్ బౌలర్.. షాక్ తో వణికిన జింబాబ్వే బ్యాట్స్ మేన్
Bouncer
Follow us

|

Updated on: Apr 24, 2021 | 6:11 PM

Bouncer: అంతర్జాతీయ క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లు వేసే బౌన్సర్లు ఎదుర్కోవడం చాలా కష్టమైన పని. వాటిని ఎదుర్కుని బ్యాట్ తొ బదులివ్వడం కష్టం.. అలా అని వదిలేస్తే దెబ్బలు తగిలే చాన్సూ ఉంటుంది. సాధారణంగా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్లు బౌన్సర్లతో బెంబేలెత్తిస్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన బౌలర్లు బౌన్సర్లు సంధించడం తక్కువ. కానీ ఓ బౌలర్ తన తొలిమ్యాచ్ లోనే బ్యాట్స్ మెన్ కు బౌన్సర్లతో చుక్కలు చూపించాడు. వేగంగా వస్తున్న బంతులు ఒక్కసారిగా పైకి లేచి మీదకు వస్తుంటే బ్యాట్స్ మెన్ బడులివ్వలేకపోయారు.

పాకిస్తాన్-జింబాబ్వే జట్ల మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో రెండో మ్యాచ్ శుక్రవారం జరిగింది. దీనిలో పాకిస్తాన్ తరఫున 20 ఏళ్ల అర్షద్ ఇక్బాల్ తొలిసారిగా బౌలర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తన తోలి మ్యాచ్ లోనే బౌలర్ గా సత్తా చాటాడు. ఇతను వేసిన ఓ బౌన్సర్ జింబాబ్వే బ్యాట్స్ మెన్ హెల్మెట్ ను గిరాటు వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే జట్టు 118 పరుగులు చేసింది. కానీ, పాకిస్తాన్ ను 99 పరుగులకే కట్టడి చేసి మ్యాచ్ లో విజయం సాధించింది. పాకిస్తాన్ పై ఇప్పటివరకూ జింబాబ్వే ఆడిన 16 టీ20 లలో తొలిసారి జింబాబ్వే విజయం సాధించడం విశేషం.

ఈ వీడియోలో ఆ బౌలింగ్ చూడొచ్చు..

పాకిస్తాన్ బౌలర్ వేసిన ఈ బౌన్సర్ కు జింబాబ్వే బ్యాట్స్ మేన్ హెల్మెట్ రెండు ముక్కలుగా విరిగి నెల మీద పడిపోయింది.

పాకిస్తాన్ బౌలర్ ఇక్బాల్ వేసిన బంతికి హెల్మెట్ ఎగిరిపోవడంతో జింబాబ్వే బ్యాట్స్ మెన్ కముంకంవె బిత్తరపోయాడు. దెబ్బతో వణికి పోయాడు. పాకిస్తాన్ ఫీల్డర్లు ఆ బ్యాట్స్ మెన్ దగ్గరకు వెళ్లి పలకరించారు. జింబాబ్వే ఫిజియో బ్యాట్స్ మెన్ వద్దకు వచ్చి అతని తలకు ఏదైనా గాయం తగిలిందేమో పరిశీలించారు. తరువాత ఆట తిరిగి మొదలైంది.

ఈ మ్యాచ్ లో జింబాబ్వే తొమ్మిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అర్షద్ ఇక్బాల్ తన తొలి అంతర్జాతీయ వికెట్ తీశాడు. 16 పరుగులిచ్చి ఒక వికెట్ సాధించాడు. దీనికి జవాబుగా బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 99 పరుగులకే తమ ఇన్నింగ్స్ ముగించింది. బాబర్ ఆజం ఒక్కడే 41 పరుగులు చేశాడు. అతను కాకుండా ఇంకో ఇద్దరు బ్యాట్స్ మెన్ మాత్రమె రెండు అంకెల పరుగులు సాధించారు. మూడు వికెట్లకు 78 పరుగులు చేసిన పాకిస్తాన్ తరువాత 11 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.

Also Read: Bank Account:సేవింగ్స్ ఎకౌంట్ లో ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే.. షరతులు వర్తిస్తాయి!

YouTube: యూట్యూబ్ లో వీడియోలు చేసేవారికి శుభవార్త.. ఎకౌంట్ డిటైల్స్ మార్చకుండానే ఛానల్ పేరు మార్చుకోవచ్చు!

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..