‘ఫైనల్ ఫోబియా’ టీమిండియాను వీడనంటోంది. సీనియర్ జట్టుతో పాటు యువ ఆటగాళ్లు కూడా తుది మెట్టుపై బోల్తాపడుతున్నారు. ఆదివారం కోలంబో వేదికగా జరిగిన ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. పాకిస్తాన్ చేతిలో ఏకంగా 128 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గ్రూప్ మ్యాచ్‌ల్లో పాక్‌తో పాటు అన్ని జట్లపై అదరగొట్టిన టీమిండియా ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. మొదట బౌలింగ్ ఆతర్వాత బ్యాటింగ్‌లో సమష్ఠిగా విఫలమైంది. దీంతో ఆసియా కప్ ఫైనల్‌లో పాక్ చేతిలో ఘోర పరాభవం తప్పలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. తాహిర్ (71 బంతుల్లో 108) శతకంతో చెలరేగగా, ఫర్హాన్ (65), సైమ్ అయుబ్ (59) అర్ధ శతకాలతో రాణించారు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శుభారంభం దక్కినప్పటికీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ (61) మినహా మరెవరూ క్రీజులో నిలవలేకపోయారు. పాక్ బౌలర్లు సమష్ఠిగా రాణించి వరుసగా వికెట్లు తీయడంతో 40 ఓవర్లలో 230 పరుగులకే కుప్పకూలింది. దీంతో 128 పరుగుల భారీ తేడాతో పాక్ మ్యాచ్‌తో పాటు ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది.
పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖీమ్ 3, మెహ్రాన్ ముంతాజ్ 2, మహ్మద్ వాసిమ్ జూనియర్ 2, అర్షద్ ఇక్బాల్ 2, ముబాసిర్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ను తలపించింది. ఆ ఫైనల్‌లోనూ భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. 2017 ఫైనల్‌లో, భారత్‌కు ముందుగానే ఫకర్ జమాన్ వికెట్ పడగొట్టింది. అయితే జస్ప్రీత్ బుమ్రా వేసిన బంతి నో బాల్ కావడంతో ఫఖర్ ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఆపై 300పై చిలుకు స్కోరు సాధించి భారత్ పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనే పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ కు దిగింది. నాలుగో ఓవర్‌లోనే రాజ్‌వర్ధన్ హంగర్‌గేకర్ అయ్యూబ్‌ను ఔట్ చేశాడు. అయితే అంపైర్ దానిని నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో అతను సాహిబ్జాదా ఫర్హాన్‌తో కలిసి కేవలం 17.2 ఓవర్లలో 121 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని పంచుకోవడం ద్వారా జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు.
Tayyab Tahir’s amazing 108 & Sufiyan Muqeem’s 3 wickets powered Pakistan ‘A’ to a big win against India ‘A’ in the finals of #ACCMensEmergingTeamsAsiaCup! Pakistan ‘A’ posted a total of 352. In reply, the India could only manage 224, but it was a valiant effort nonetheless! #ACC pic.twitter.com/ygesEuKHgT
— AsianCricketCouncil (@ACCMedia1) July 23, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..