AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: కివీస్ చేతిలో ఘోర పరాజయం.. కట్ చేస్తే.. స్పెషల్ హెలికాప్టర్‌లో దేశం దాటిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్.. ఎందుకంటే?

కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో, పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిజ్వాన్ 77 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ అతని జట్టు గెలవలేకపోయింది.

Pakistan: కివీస్ చేతిలో ఘోర పరాజయం.. కట్ చేస్తే.. స్పెషల్ హెలికాప్టర్‌లో దేశం దాటిన పాకిస్తాన్ స్టార్ ప్లేయర్.. ఎందుకంటే?
Mohammad Rizwan
Venkata Chari
|

Updated on: Jan 15, 2023 | 9:10 AM

Share

ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. ఇంతలో ఆ జట్టును పరాజయాలు మాత్రం వీడడం లేదు. దీంతో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకపోయింది. వీటన్నింటి మధ్యలో ఓ పాకిస్తాన్ క్రికెటర్.. ఏకంగా రెండు రోజుల వ్యవధిలో రెండు మ్యాచ్‌లు ఆడిన వార్త ఒకటి బయటకు వచ్చింది. అది కూడా వేర్వేరు దేశాల్లో ఆడడంతో అంతా షాక్ అవుతున్నారు. కాగా, శుక్రవారం, జనవరి 13, కరాచీలో, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. జట్టు అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం.. ఇవేవీ పట్టించుకోకుండా.. బంగ్లాదేశ్‌లో మ్యాచ్ ఆడేందుకు వెళ్లాడు.

మొహమ్మద్ రిజ్వాన్ జనవరి 14వ తేదీ శనివారం ఉదయం బంగ్లాదేశ్‌లోకి అడుగుపెట్టిన వెంటనే, అందరూ ఆశ్చర్యపోయారు. బంగ్లాదేశ్‌లో హెలికాప్టర్‌లో దిగిన ఆయన ఫొటోలు, వీడియోలు కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ ఓటమి తర్వాత బంగ్లాదేశ్‌కు..

నిజానికి పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం కరాచీలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. దీంతో పాటు పాక్ జట్టు కూడా సిరీస్ కోల్పోయింది. రిజ్వాన్ ఈ మ్యాచ్‌లో భాగమయ్యాడు. అక్కడ అతను మొదట 77 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడి, ఆపై వికెట్ కీపింగ్ చేశాడు. తరువాత 13-14 గంటల్లో, రిజ్వాన్ బంగ్లాదేశ్ చేరుకున్నాడు. అక్కడ అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు.

స్పెషల్ హెలికాప్టర్‌తో..

రిజ్వాన్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ జట్టులో సభ్యుడు. అతన్ని మైదానానికి తీసుకెళ్లడానికి జట్టు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. రిజ్వాన్ మ్యాచ్‌కు గంట ముందు మాత్రమే మైదానానికి చేరుకోగలిగాడు. అయినప్పటికీ అతను ప్లేయింగ్ XIలో భాగమయ్యాడు. అయితే ఇంత త్వరగా చేరినా జట్టుకు పెద్దగా సహకారం అందించలేకపోయాడు. ఓపెనింగ్ చేస్తున్నప్పుడు, రిజ్వాన్ 18 పరుగులు మాత్రమే చేశాడు. అతని జట్టు 18 పరుగుల తేడాతో ఫార్చ్యూన్ బరిషల్ చేతిలో ఓడిపోయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..