PAK vs AUS: పాకిస్థాన్ జట్టు నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ తప్పదా?

PAK vs AUS 3rd Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ 79 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఇప్పుడు మూడో మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్‌ను తప్పించుకునేందుకు బరిలోకి దిగనుంది.

PAK vs AUS: పాకిస్థాన్ జట్టు నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ తప్పదా?
Pakistan Team
Follow us

|

Updated on: Jan 02, 2024 | 3:26 PM

PAK vs AUS: ఆస్ట్రేలియా (Australia)తో జరిగే పింక్ టెస్ట్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ (Pakistan) ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. సిడ్నీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ప్రధాన బౌలర్ షాహీన్ అఫ్రిదికి దూరమయ్యాడు. అలాగే, ఎడమచేతి వాటం ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్‌ను కూడా ప్లేయింగ్ స్క్వాడ్‌లో అనుమతించలేదు.

ఇక్కడ ఇమామ్ ఉల్ హక్ స్థానంలో యువ బ్యాట్స్‌మెన్ సయీమ్ అయ్యూబ్‌కు అవకాశం కల్పించారు. అలాగే, షాహీన్ ఆఫ్రిది పాత్రలో సాజిద్ ఖాన్ కనిపించాడు. మహ్మద్ రిజ్వాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగాడు.

సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్..

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ 79 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఇప్పుడు 2-0 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్ జట్టు క్వీన్ స్వీప్‌ను తప్పించుకునేందుకు జట్టులో మార్పు చేసింది. ఈ మార్పు కారణంగా పాకిస్థాన్ లీడింగ్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది ఔట్ కావడం ఆశ్చర్యకరం.

పాకిస్థాన్ ప్లేయింగ్ 11:

అబ్దుల్లా షఫీక్

సిమ్ అయూబ్

షాన్ మసూద్

బాబర్ ఆజం

సౌద్ షకీల్

మహ్మద్ రిజ్వాన్

సల్మాన్ అలీ అఘా

సాజిద్ ఖాన్

హసన్ అలీ

మీర్ హంజా

అమీర్ జమాల్.

పాకిస్థాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, అమీర్ జమాల్, షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీ, మీర్ హంజా, సర్ఫరాజ్ అహ్మద్ , మహ్మద్ నవాజ్ , ఫహీమ్ అష్రఫ్, అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్, మొహమ్మద్ వాసిం జూనియర్, సాజిద్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..