ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌..! అసదుద్దీన్‌ ఒవైసీ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌

ఆసియా కప్‌లోని భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను AIMIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాజా ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను నిర్వహించడం సరికాదని, కేంద్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌..! అసదుద్దీన్‌ ఒవైసీ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌
Asaduddin Owaisi

Updated on: Aug 10, 2025 | 7:08 AM

ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లో జరగనున్న భారత్ వర్సెస్‌ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను తాను చూడబోనని AIMIM చీఫ్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. “దుబాయ్‌లో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నామని తెలిసి నేను ఆశ్చర్యపోయాను. నేను దానిని చూడను” అని ఒవైసీ అన్నారు. “నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవని, చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని ప్రధానమంత్రి స్వయంగా చాలాసార్లు చెప్పినప్పుడు మీరు ఎలా పాకిస్థాన్‌తో క్రికెట్‌ ఆడతారంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

భారతదేశంలో క్రికెట్ అనేది ఒక వ్యామోహం అని, ప్రతిదీ స్తంభింపజేస్తుందని ఒవైసీ అన్నారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రజలు వారి కుటుంబాల ముందే కాల్చి చంపబడ్డారు. ఈ దాడి తనను తీవ్రంగా బాధించిందని ఆయన అన్నారు. ఈ సంఘటన చాలా దారుణం. భార్యాపిల్లల ముందే ఎవరైనా కాల్చి చంపబడటం బాధాకరం. ఇంత దారుణం జరిగినప్పుడు పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడటంలో అర్థం లేదు అని ఒవైసీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ, కేంద్ర ప్రభుత్వం మ్యాచ్‌కు అనుమతి ఇచ్చిందని ఆయన అన్నారు.

అలాగే హిందూ ఉగ్రవాదం అనేదే లేదు అని హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనకు ప్రతిస్పందిస్తూ.. మహాత్మా గాంధీని ఎవరు చంపారు? ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను ఎవరు చంపారు? ఢిల్లీ వీధుల్లో సిక్కులను ఎవరు చంపారు? ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌లలో పోలీసు సిబ్బందిని ఎవరు చంపుతున్నారు? అని ప్రశ్నించారు. ఉగ్రవాదం కొత్త మతంగా మారింది. ఈ ఉగ్రవాదులు మతం పేరుతో అన్ని చర్యలను చేస్తారు అని ఆయన అన్నారు. మహాత్మా గాంధీని ఎవరు చంపారో అమిత్ షా మర్చిపోయి ఉండవచ్చు. స్వతంత్ర భారతదేశంలో మొదటి ఉగ్రవాది నాథూరామ్ గాడ్సే అని ఒవైసీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి