
ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో కాశీ రుద్రాస్ టీం బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. గౌర్ గోరఖ్‌పూర్ లయిన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదారు. శివమ్ శర్మ వేసిన 18వ ఓవర్‌లో తొలి 3 బంతులను శివ సింగ్ సిక్సర్లు బాదగా, 5,6 బంతులను శివమ్ మావీ సిక్సర్లుగా మలిచారు. ఒక సింగిల్‌తో కలిపి ఆ ఓవర్‌లో మొత్తం 31 రన్స్ వచ్చాయి. ఈ మ్యాచ్‌లో శివమ్ మావి 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. 257 స్ట్రైక్ రేట్‌తో ఆడిన మావి మొత్తంగా 21 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 54 పరుగులలో 36 పరుగులు సిక్సర్ల రూపంలో రాబట్టాడు. అటు కేఆర్డీ కెప్టెన్ కరణ్ శర్మ 19 బంతుల్లో 39 పరుగులు చేయడంతో.. ఆ జట్టు 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
ఇదిలా ఉండగా.. కాశీ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మావి, శివ సిక్సర్లు కొట్టారు. వీరిద్దరూ కలిసి ఆరు బంతుల్లో ఐదు బంతులను బౌండరీ లైన్ దాటించారు. శివ మొదటి మూడు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదగా.. నాల్గవ బంతిని సింగిల్ తీసి.. మావి చివరి రెండు బంతుల్లో మరో రెండు సిక్సర్లు కొట్టాడు. శివ సింగ్ 17 బంతుల్లో 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి వాసు వాట్స్ బౌలింగ్‌లో శివమ్ మావి అవుట్ అయ్యాడు.
మావి చివరిసారిగా జనవరిలో రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గత రెండు సంవత్సరాలుగా అతను ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 నుంచి గాయం కారణంగా వైదొలిగాడు. ఈ ఆటగాడు ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కాగా, ఈ మ్యాచ్‌లో గౌర్ గోరఖ్‌పూర్ లయిన్స్ లక్ష్యచేధనలో చతికిలబడింది కేవలం 126 పరుగులకే ఆలౌట్ అయింది.