Team India: తొలి 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు.. సచిన్‌నే మించిపోయాడు.. కట్ చేస్తే.. కెరీర్ ఖేల్ ఖతం! ఎవరంటే?
ప్రతీ ఆటగాడి కెరీర్ లాంగ్ రన్‌గా ఉండదు. కొందరు మధ్యలోనే జట్టు నుంచి డ్రాప్ అయితే.. మరికొందరు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు.
ప్రతీ ఆటగాడి కెరీర్ లాంగ్ రన్‌గా ఉండదు. కొందరు మధ్యలోనే జట్టు నుంచి డ్రాప్ అయితే.. మరికొందరు అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. ఇంకొందరు జట్టులో లాంగ్ రన్ చేస్తారు. అయితే ఇప్పుడు చెప్పబోయే క్రికెటర్ అత్యంత ప్రతిభావంతుడు, ఏకంగా సచిన్ టెండూల్కర్‌ను దాటేస్తాడని ఊహించారు. కట్ చేస్తే.. ఆపై కెరీర్ కాస్తా క్లోజ్ అయింది. అతడెవరో కాదు వినోద్ కాంబ్లీ. ఈరోజు అంటే జనవరి 18న వినోద్ కాంబ్లీ పుట్టినరోజు. 1972వ సంవత్సరం ముంబైలో జన్మించిన కాంబ్లీ.. స్కూల్ క్రికెట్‌లో సచిన్‌తో కలిసి 664 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.. టీమిండియాకు కొంతకాలం ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
సచిన్ అరంగేట్రానికి, కాంబ్లీ అరంగేట్రానికి మధ్య రెండేళ్ల గ్యాప్ ఉంది. సచిన్ నవంబర్ 1989లో పాకిస్థాన్‌పై టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. కాంబ్లీ 1991లో అదే జట్టుపై వన్డే మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. కాంబ్లీ టెస్టు కెరీర్ ఆరంభం అద్భుతంగా సాగింది. అతడు ఫిబ్రవరి 1993లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో తన మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తొలి ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు బాదేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. అయితే దీని తర్వాత ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ బ్యాట్‌తో ఫ్లాప్ షో చూపించాడు. అతడి టెస్ట్ కెరీర్ కూడా పూర్తయిపోయింది. మొత్తంగా 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వినోద్ కాంబ్లీ 54.20 సగటుతో 1084 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలు, నాలుగు శతకాలు ఉన్నాయి.
అటు వన్డే కెరీర్‌లో, కాంబ్లీ భారత్ తరపున 104 ODIలు ఆడి 32.59 సగటుతో 2477 పరుగులు చేశాడు, ఇందులో రెండు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ప్రతీసారి అతడ్ని జట్టు నుంచి పక్కన పెట్టేవారు. షార్జాలో శ్రీలంకతో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు వినోద్ కాంబ్లీ గుడ్ బై చెప్పాడు.