AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ, 1st ODI ‌‌Highlights: ఉత్కంఠ విజయం.. చివరి ఓవర్లో గెలిచిన భారత్..

India vs New Zealand 1st ODI highlights: శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ ఆధారంగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

IND vs NZ, 1st ODI ‌‌Highlights: ఉత్కంఠ విజయం.. చివరి ఓవర్లో గెలిచిన భారత్..
India vs New Zealand 1st ODI
Venkata Chari
|

Updated on: Jan 18, 2023 | 9:59 PM

Share

శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ ఆధారంగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ తరపున, మైఖేల్ బ్రేస్‌వెల్ 78 బంతుల్లో 140 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు, కానీ అతను తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది. జట్టు తరపున గిల్ తన వన్డే కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 149 బంతుల్లో 208 పరుగులు చేసి ఔట్ అయింది. హార్దిక్ పాండ్యా (28 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (31 పరుగులు), రోహిత్ శర్మతో కలిసి గిల్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు గిల్ 74 పరుగులు, సూర్యతో కలిసి నాలుగో వికెట్‌కు 65 పరుగులు, రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. దీంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 49.1 వికెట్లకు 337 పరుగులు మాత్రమే చేయగలిగింది. కివీ జట్టు తరఫున మైఖేల్ బ్రేస్‌వెల్ తన వన్డే కెరీర్‌లో రెండో సెంచరీని నమోదు చేశాడు. కాగా మిచెల్ సాంట్నర్ (57 పరుగులు) మూడో అర్ధశతకం సాధించాడు. వీరిద్దరి మధ్య 162 పరుగుల భాగస్వామ్యం ఉంది. న్యూజిలాండ్ సులువుగా గెలుస్తుందని కాసేపు అనిపించింది. కానీ, మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్‌ను మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు.

ఇరు జట్లు..

టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, హెన్రీ షిప్లీ, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్

Key Events

13 ఏళ్ల తర్వాత కేన్ విలియమ్సన్ లేకుండా..

న్యూజిలాండ్ 13 ఏళ్ల తర్వాత కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీ లేకుండా వన్డేల్లోకి దిగనుంది. చివరిసారిగా ఇది డిసెంబర్ 2010లో జరిగింది.

వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌-1కి చేరే ఛాన్స్..

కివీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌-1కి చేరుకునే అవకాశం ఉంది .

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 18 Jan 2023 09:58 PM (IST)

    IND vs NZ 1st ODI: భారత్ ఉత్కంఠ విజయం

    శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ ఆధారంగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ తరపున, మైఖేల్ బ్రేస్‌వెల్ 78 బంతుల్లో 140 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు, కానీ అతను తన జట్టును గెలిపించలేకపోయాడు. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

  • 18 Jan 2023 08:41 PM (IST)

    స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన..

    మైఖేల్ బ్రాస్‌వెల్, శాంటర్న్‌ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు తీయిస్తున్నాడు. హార్దిక్ వేసిన 35 ఓవర్లో 12 పరుగులు రాగా.. శార్దూల్ ఠాకూర్‌ వేసిన 37 ఓవర్లో బ్రాస్‌వెల్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 38 ఓవర్‌లో రెండో బంతికి మైఖేల్ మరో సిక్సర్ బాదాడు.

  • 18 Jan 2023 08:06 PM (IST)

    29 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్..

    29 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. బ్రాస్‌వెల్ 12, శాంట్నర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ విజయం సాధించాలంటే ఇంకా 219 పరుగులు చేయాల్సి ఉంది.

  • 18 Jan 2023 07:38 PM (IST)

    23 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్..

    23 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం 4 వికెట్లు కోల్పోయి 107 పరుగులు పూర్తి చేసింది. పిలిప్స్ 9, లాథం 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 Jan 2023 06:56 PM (IST)

    రెండో వికెట్ డౌన్..

    శార్దుల్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ 40 (39 బంతులు, 7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 70 పరుగుల వద్ద కివీస్ జట్టు రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 18 Jan 2023 06:20 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    సిరాజ్ బౌలింగ్‌లో డేవాన్ కాన్వే 10(16 బంతులు, 2 ఫోర్లు) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 28 పరుగుల వద్ద కివీస్ జట్టు తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 18 Jan 2023 06:10 PM (IST)

    4 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్..

    4 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ టీం వికెట్లేమీ కోల్పోకుండా 24 పరుగులు పూర్తి చేసింది. ఫిన్ 10, కాన్వే 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 Jan 2023 05:31 PM (IST)

    న్యూజిలాండ్ టార్గెట్ 350..

    శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ ఆధారంగా భారత్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌కి 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 349 పరుగులు చేసింది.

  • 18 Jan 2023 04:56 PM (IST)

    45 ఓవర్లకు భారత్…

    45 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 292 పరుగులు పూర్తి చేసింది. గిల్ 162, శార్దుల్ 0 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 Jan 2023 04:35 PM (IST)

    5వ వికెట్ డౌన్..

    హార్దిక్ పాండ్యా 28(38 బంతులు, 3 ఫోర్లు) పరుగులు చేసిన తర్వాత ఐదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మిచెల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ 41 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. గిల్ 138 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 18 Jan 2023 04:11 PM (IST)

    36 ఓవర్లకు భారత్…

    36 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు పూర్తి చేసింది. గిల్ 120, హార్దిక్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 Jan 2023 03:40 PM (IST)

    IND vs NZ: గిల్ సెంచరీ ఇన్నింగ్స్..

    టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ వరుస సెంచరీలతో దూసుకపోతున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో కేవలం 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

  • 18 Jan 2023 03:35 PM (IST)

    4వ వికెట్ డౌన్..

    సూర్య కుమార్ యాదవ్ 31(26 బంతులు, 4 ఫోర్లు) పరుగులు చేసిన తర్వాత నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. మిచెల్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 28.4 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. గిల్ 92 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 18 Jan 2023 03:28 PM (IST)

    IND vs NZ: 27 ఓవర్లకు భారత్..

    27 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 168 పరుగులు పూర్తి చేసింది. గిల్ 86, సూర్య 30 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 Jan 2023 02:58 PM (IST)

    అందుకే రాలేక పోతున్నాను.. మరోసారి వస్తా..

    కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉన్నా.. అక్కడి అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో రాలేకపోయారు. పంచతంత్ర అనే కార్యకర్తల సమావేశాల్లో కచ్చితంగా పాల్గొంటారని గతంలో ప్రామిస్‌ చేశారని టీవీ9తో చెప్పారు కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ కుమార్‌. నెక్స్ట్‌ జరిగే సభలు, సమావేశాలకు తాను కచ్చితంగా వస్తానని కేసీఆర్‌కు చెప్పారు కుమారస్వామి.

  • 18 Jan 2023 02:56 PM (IST)

    ఇషాన్ ఔట్..

    ఇసాన్ కిషన్ కేవలం 5(14 బంతులు) పరుగులు చేసిన తర్వాత మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఫెర్గ్యూసన్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం భారత్ 20 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. గిల్ 58 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 18 Jan 2023 02:54 PM (IST)

    గిల్ హాఫ్ సెంచరీ..

    టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీతో దూసుకపోతున్నాడు. 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో తన అర్థసెంచరీని పూర్తి చేసుకున్నాడు.

  • 18 Jan 2023 02:40 PM (IST)

    కోహ్లీ ఔట్..

    టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ 8(10 బంతులు, 1 ఫోర్) పరుగులు చేసిన తర్వాత రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. శాంట్నర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం భారత్ 16 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. గిల్ 42 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 18 Jan 2023 02:38 PM (IST)

    పొరుగు రాష్ట్రాల నుంచి జన సమీకరణ..

    బీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభకు సీఎం కేసీఆర్‌తోపాటు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌, వామపక్షనేత డీ.రాజాతో పాటు మరికొందరు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతున్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ సహా సమీప జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి జన సమీకరణ జరిగింది.

  • 18 Jan 2023 02:37 PM (IST)

    అన్ని దారులూ ఖమ్మంవైపే..

    అన్ని దారులూ ఖమ్మంవైపే. అందరి చూపూ సభ మీదే. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభపై నిలుస్తోంది. ఖమ్మం గుమ్మం నుంచి బీఆర్ఎస్ సమర శంఖం పూరించబోతున్నారు సీఎం కేసీఆర్. ఆవిర్భావ సభను విజయవంతం చేసి.. జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మీటింగ్ లో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అందుకే అందరి దృష్టి ఖమ్మం సభ పైనే నిలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ఈ సభపైనే చర్చ జరుగుతోంది.

  • 18 Jan 2023 02:27 PM (IST)

    రోహిత్ ఔట్..

    టీమిండియా సారథి రోహిత్ శర్మ 34(38 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు) పరుగులు చేసిన తర్వాత తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. టిక్నర్ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ప్రస్తుతం భారత్ 14 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 74 పరుగులు చేసింది. గిల్ 33, కోహ్లీ 2 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 Jan 2023 02:11 PM (IST)

    10 ఓవర్లకు భారత్…

    10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ కోల్పోకుండా 52 పరుగులు పూర్తి చేసింది. రోహిత్ 27, గిల్ 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 18 Jan 2023 01:36 PM (IST)

    IND vs NZ 1st ODI: ఓపెనర్లుగా రోహిత్, గిల్..

    టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ బరిలోకి దిగారు.

  • 18 Jan 2023 01:07 PM (IST)

    IND vs NZ 1st ODI: న్యూజిలాండ్ టీం..

    న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్/కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, హెన్రీ షిప్లీ, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్

  • 18 Jan 2023 01:06 PM (IST)

    IND vs NZ 1st ODI: టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..

    టీమిండియా ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ

  • 18 Jan 2023 01:03 PM (IST)

    IND vs NZ 1st ODI: టాస్ గెలిచిన భారత్..

    ఉప్పల్ స్టేడియంలో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో టీమిండియా సారథి టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ బౌలింగ్ చేయనుంది.

  • 18 Jan 2023 12:39 PM (IST)

    IND vs NZ 1st ODI: స్టేడియానికి చేరుకున్న ఇరుజట్లు..

  • 18 Jan 2023 12:37 PM (IST)

    IND vs NZ: ఉప్పల్ పోరుకు రంగం సిద్ధం..

    మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.

Published On - Jan 18,2023 12:29 PM