AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yuvraj Singh: యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ వివాహ బంధానికి ఐదేళ్లు..

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి హాజెల్ కీచ్ వివాహం జరిగి మంగళవారం నాటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 5వ వార్షికోత్సవం సందర్భంగా హాజెల్ కీచ్ తన వివాహ ఆల్బమ్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది...

Yuvraj Singh: యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ వివాహ బంధానికి ఐదేళ్లు..
Yuvaraj
Srinivas Chekkilla
|

Updated on: Nov 30, 2021 | 9:56 PM

Share

మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, నటి హాజెల్ కీచ్ వివాహం జరిగి మంగళవారం నాటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. 5వ వార్షికోత్సవం సందర్భంగా హాజెల్ కీచ్ తన వివాహ ఆల్బమ్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ జంట విదేశాల్లో ఉన్నారు. ” మేము మొదటిసారి కలుసుకున్నప్పుడు నాకు ఏమి తెలియదు, నా జీవితం శాశ్వతంగా మారుతుందని నాకు అప్పుడు తెలియదు,” అని హేజెల్ కీచ్ రాసుకొచ్చింది. ” నేను ఎన్నడూ చూడని అతిపెద్ద మార్పుకు 5 సంవత్సరాల్లో వచ్చిందని అన్నారు. హాజెల్ కీచ్, యువరాజ్ సింగ్ 2016 నవంబర్ 30న వివాహం చేసుకున్నారు.

యువరాజ్ సింగ్ కూడా తన భార్యకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపాడు. అతను తమ చిత్రాన్ని పంచుకున్నాడు. “5 సంవత్సరాలు చాలా బాగా గడిచింది. వార్షికోత్సవ శుభాకాంక్షలు బేబీ.” అని రాసుకొచ్చాడు. మొదట్లో టీవీ ప్రకటనల్లో మోడల్‌గా పనిచేసిన హాజెల్ కీచ్, 2007 తమిళ చిత్రం బిల్లాతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా నటించింది. హాజెల్ కొన్ని టీవీ రియాల్టీ షోలలో కూడా కనిపించింది.

Read Also.. IPL 2022 Retention Players List: ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్లేయర్లు వీరే? కేఎల్ రాహుల్‌కు షాకిచ్చిన పంజాబ్.. పూర్తి జాబితా ఇదిగో..!