Cricket in Olympics: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చే న్యూస్‌.. ఇకపై ఒలింపిక్స్‌లోనూ టీ20 మెరుపులు! ఎప్పుడంటే?

|

Nov 20, 2022 | 7:45 AM

ప్రస్తుతం టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంపై ఐసీసీ దృష్టి సారించింది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ క్రీడల్లో ఈ గేమ్‌ను చేర్చడంపై మరింత దృష్టి సారించింది.

Cricket in Olympics: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చే న్యూస్‌.. ఇకపై ఒలింపిక్స్‌లోనూ టీ20 మెరుపులు! ఎప్పుడంటే?
Cricket In Olympics
Follow us on

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ అభిమానులను అలరించడంలో గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. అనేక ఆశ్చర్యకరమైన ఫలితాలు, మలుపులతో సాగిన ఈ ప్రపంచ కప్ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు కావాల్సిన మజాను అందించింది. ఇక ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి ఇంగ్లండ్ జట్టు రెండోసారి వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచింది. కాగా ప్రస్తుతం టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంపై ఐసీసీ దృష్టి సారించింది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ క్రీడల్లో ఈ గేమ్‌ను చేర్చడంపై మరింత దృష్టి సారించింది. నిజానికి క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో భాగం చేసేందుకు ఐసీసీ చాలా ఏళ్లుగా కృషి చేస్తోంది. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌కు చోటు ఉండవచ్చని తెలుస్తోంది. 2028 ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందంటూ ప్రముఖ బ్రిటీష్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ నివేదించింది. 100 సంవత్సరాలలో మొదటిసారిగా, క్రికెట్‌ను ఒలింపిక్ క్రీడలలో చేర్చనున్నట్లు పేర్కొంది. ఒలింపిక్ క్రీడలలో క్రికెట్‌కు ఒక్కసారి మాత్రమే చోటు దక్కింది. 1900 ఒలింపిక్స్‌లో బ్రిటన్, ఫ్రాన్స్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రిటన్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఆ తర్వాత క్రికెట్‌కు, ఒలింపిక్స్‌కు మధ్య అంతరం పెరిగింది. అయితే టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలనే డిమాండ్ బాగా పెరిగింది. దీనికి సంబంధించి గత 2-3 సంవత్సరాల్లో ప్రతిపాదనలు ఎక్కువయ్యాయి. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఇప్పుడు 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది. పురుషులతో పాటు మహిళల క్రికెట్‌కు ఈ ఒలింపిక్స్‌ లో భాగం కల్పించనున్నారు. ఐసీసీ ర్యాంకింగ్‌ ఆధారంగా టాప్‌-6లో ఉన్న జట్లను రెండు గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీని కాగా ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ 2022లో మహిళల టీ20 క్రికెట్‌ను చేర్చారు. ఈ ఈవెంట్‌లో క్రికెట్ ఘన విజయం సాధించింది. అంతేకాకుండా, క్రికెట్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి వెస్టిండీస్‌తో పాటు అమెరికాకి కూడా టీ 20 ప్రపంచ కప్ 2024 ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..