Yuzvendra Chahal : టీ షర్ట్ గొడవ మరిచిపోకముందే మరో వివాదం..చాహల్ భయ్యా ‘నో మనీ.. నో హనీ’ వెనుక అసలు కథేంటి?
Yuzvendra Chahal : టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. ఈసారి ఆయన వేసిన ఒక చిన్న పోస్ట్ ఇంటర్నెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. మైదానంలో తన స్పిన్ మ్యాజిక్‌తో బ్యాటర్లను బురిడీ కొట్టించే చాహల్, వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన పెట్టిన నో మనీ.. నో హనీ అనే క్యాప్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Yuzvendra Chahal : టీమిండియా స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. ఈసారి ఆయన వేసిన ఒక చిన్న పోస్ట్ ఇంటర్నెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. మైదానంలో తన స్పిన్ మ్యాజిక్‌తో బ్యాటర్లను బురిడీ కొట్టించే చాహల్, వ్యక్తిగత జీవితంలో మాత్రం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ఆయన పెట్టిన నో మనీ.. నో హనీ అనే క్యాప్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యుజ్వేంద్ర చాహల్ తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో థాయ్‌లాండ్ ట్రిప్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశాడు. అంతవరకు బానే ఉన్నా, దానికి పెట్టిన క్యాప్షన్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. “No Money.. No Honey” (డబ్బు లేకపోతే ప్రియురాలు ఉండదు) అనే అర్థం వచ్చేలా ఎమోజీలతో సహా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ వచ్చిన కొద్దిరోజుల ముందే ఆయనకు, ప్రముఖ ఆర్‌జే మహ్వాష్‌కు మధ్య గొడవ జరిగిందని, ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో చాహల్ ఆమెనే టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టాడా? అని నెటిజన్లు అనుమానిస్తున్నారు.
భార్య ధనశ్రీ వర్మతో విడాకుల తర్వాత చాహల్, ఆర్‌జే మహ్వాష్ తరచుగా కలిసి కనిపించేవారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది. అయితే మహ్వాష్ మాత్రం తాము కేవలం స్నేహితులమేనని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియాలో దూరమవ్వడం, వెంటనే చాహల్ ఇలాంటి పోస్ట్ పెట్టడంతో వీరి స్నేహం వికటించిందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా డబ్బు విషయంలోనే ఏమైనా మనస్పర్థలు వచ్చాయా? అనే కోణంలో చర్చ సాగుతోంది.
చాహల్‌కు ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం కొత్తేమీ కాదు. గతంలో విడాకుల సమయంలో కోర్టుకు వెళ్తున్నప్పుడు ఆయన ధరించిన టీ-షర్ట్ పెద్ద రచ్చ చేసింది. దానిపై “Be Your Own Sugar Daddy” అని రాసి ఉండటంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో వివాదాస్పద పోస్ట్‌తో చాహల్ వార్తల్లోకి ఎక్కాడు. ఆటపై కాకుండా చాహల్ ఇలాంటి వాటిపై దృష్టి పెడుతున్నాడని ఆయన అభిమానులు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.
No 💰 No 🍯 pic.twitter.com/p3P1C1uK6G
— Yuzvendra Chahal (@yuzi_chahal) February 1, 2026
ఒకప్పుడు టీమిండియాలో కీలక బౌలర్‌గా ఉన్న చాహల్, గత మూడేళ్లుగా జట్టుకు దూరమయ్యాడు. సెలెక్టర్లు అతడిని వరుసగా విస్మరిస్తున్నారు. ఇప్పటివరకు చాహల్ 72 వన్డేల్లో 121 వికెట్లు, 80 టీ20ల్లో 96 వికెట్లు తీశాడు. టీ20ల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా ఉన్నా, జట్టులో స్థానం దక్కించుకోవడం అతడికి కష్టంగా మారింది. ప్రస్తుతం ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో వ్యక్తిగత వివాదాలు అతడి కెరీర్‌పై ఏ ప్రభావం చూపుతాయో చూడాలి.
