MS. Dhoni: జట్టులో అతను అంతర్భాగం.. అతడు లేనిది చెన్నై సూపర్‌ కింగ్స్‌ లేదు..

ఎంఎస్ ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ లేదని మాజీ బీసీసీఐ అధ్యక్షుడు, ఆ జట్టు యజమాని, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ (ఐసీఎల్) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ సోమవారం తెలిపారు. ఫ్రాంఛైజీకి ధోనీకి ఉన్న సంబంధం చాలా గట్టిదని చెప్పారు...

MS. Dhoni: జట్టులో అతను అంతర్భాగం.. అతడు లేనిది చెన్నై సూపర్‌ కింగ్స్‌ లేదు..
Dhoni
Follow us

|

Updated on: Oct 19, 2021 | 11:37 AM

ఎంఎస్ ధోనీ లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ లేదని మాజీ బీసీసీఐ అధ్యక్షుడు, ఆ జట్టు యజమాని, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ (ఐసీఎల్) వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ సోమవారం తెలిపారు. ఫ్రాంఛైజీకి ధోనీకి ఉన్న సంబంధం చాలా గట్టిదని చెప్పారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ధోనీ సారథ్యంలో నాలుగో సారి టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే. సోమవారం చెన్నైలోని వెంకటాచలపతి ఆలయాన్ని శ్రీనివాసన్ ట్రోఫీతో సహా దర్శించుకున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‎పై ఫైనల్లో గెలుపొంది నాలుగో సారి ఐపీఎల్‌ టైటిల్‌ సాధించడం గొప్ప విషయమన్నారు. ధోనీ నాయతక్వంలో చెన్నై అగ్రగామి జట్టుగా ఎదిగిందని చెప్పారు. చెన్నై జట్టులో ధోనీ అంతర్భాగం. అతడు లేనిదే మా జట్టు లేదని తెలిపారు. కొందరు మీడియా వాళ్లు ఫ్రాంఛైజీలో ఒక్క తమిళనాడు క్రికెటర్‌ కూడా లేడని అడిగిన ప్రశ్నకు.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో (టీఎన్‌పీఎల్‌) ఆడే 13 మంది ఆటగాళ్లు.. ఐపీఎల్‌ లేదా టీమ్‌ఇండియాలో ఆడుతున్నారని శ్రీనివాసన్ గుర్తుచేశారు. ఇప్పుడిప్పుడే టీన్‌పీఎల్‌కు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నా్రు. ఇక వచ్చే ఏడాది ధోనీని చెన్నై టీం తిరిగి తీసుకుంటారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆటగాళ్ల రిటెన్షన్‌ పద్ధతులపై తమకు ఎలాంటి సమాచారం రాలేదని చెప్పారు. ధోనీ భారత్‌కు తిరిగి వచ్చాక ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీనివాసన్ వెల్లడించారు.

Read Also.. T20 World Cup: ఓపెనర్లపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ.. వారిద్దరే ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని వెల్లడి..