T20 World Cup 2021: రోహిత్ శర్మ నాశైలిని దొంగిలించాడు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ఆస్ట్రేలియా ఓపెనర్ కామెంట్
India New Jersey: రోహిత్ శర్మ టీమిండియా జెర్సీతో ఓ వీడియోను నెట్టింట్లో పంచుకున్నాడు. దానిపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ అందించాడు.
Rohit Sharma Vs David Warner: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన తొలి వార్మప్ మ్యాచులో రోహిత్ శర్మ బ్యాటింగ్ కనిపించలేదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు బెంచ్‌లోనే కూర్చున్నాడు. అయితే ఇంతలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ రోహిత్ శర్మపై దొంగతనం చేశాడంలూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. అయితే రెండో వార్మప్ ముందు రోహిత్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని డేవిడ్ వార్నర్ అనుకోలేదు. ఇదంతా సోషల్ మీడియాలో జరిగిన ఓ సరదా సంభాషణ మాత్రమే. అసలు విషయంలోకి వెళ్తే..
రోహిత్ శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడని తెలిసిందే. ఏదో ఒక వీడియోతో నెటిజన్లను అలరిస్తుంటాడు. తాజాగా టీమిండియా జెర్సీతో ఓ వీడియోను నెట్టింట్లో పంచుకున్నాడు. తన హోటల్ గదిలో టీమిండియా జెర్సీతో టిక్‌టాక్ వీడియోలో చేసే మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఈవీడియో నెట్టింట్లో బాగానే ఆకట్టుకుంది. నెటిజన్లు కూడా రోహిత్‌కు ఆల్ ది బెస్ట్ చెప్తూ, వీడియో బాగుంది అని కామెంట్లు చేశారు. అయితే డేవిడ్ వార్నర్ మాత్రం తనదైన శైలిలో రోహిత్ వీడియోకు కామెంట్ చేశాడు. ‘మీరు నా టిక్ టోక్ శైలిని కాపీ చేశారు’ అని సరదాగా కామెంట్ చేశాడు. యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ కూడా ఫన్నీగా కామెంట్లు చేశారు.
మొదటి వార్మప్ మ్యాచ్‌లో రోహిత్ ఆడలేదు అక్టోబర్ 18 న ఇంగ్లండ్‌తో టీమిండియా తన మొదటి వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కనిపించలేదు. రెండవ వార్మప్ మ్యాచ్‌లో ఆడతాడని భావిస్తున్నారు. అక్టోబర్ 24 న పాకిస్థాన్‌తో భారత్ తన తొలి కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది. మరోవైపు, డేవిడ్ వార్నర్ న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో వార్నర్ ఖాతా కూడా తెరవలేదు. టిమ్ సౌథీ మొదటి బంతికే డేవిడ్ వికెట్‌ను పడగొట్టాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ తన బ్యాటింగ్ బలంపై ఈ విజయాన్ని సాధించింది. మరోవైపు, ఆస్ట్రేలియా కూడా వార్మప్‌లో విజయాన్ని రుచి చూసింది. న్యూజిలాండ్‌ని 3 వికెట్లతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 158 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో ఈ లక్ష్యాన్ని సాధించింది.
View this post on Instagram