T20 World Cup: ఉత్కంఠ రేపిన వార్మప్ మ్యాచ్.. చివరి ఓవర్‌లో 13 పరుగులు కావాలి.. చివరికి ఎవరు గెలిచారంటే..
టీ 20 వరల్డ్ కప్‌లో వార్మప్ మ్యాచ్‌లు కూడా మంచి మజా ఇస్తున్నాయి. సోమవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అబుదాబిలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది...
టీ 20 వరల్డ్ కప్‌లో వార్మప్ మ్యాచ్‌లు కూడా మంచి మజా ఇస్తున్నాయి. సోమవారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అబుదాబిలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. కంగారూలు ఒక బంతి మిగిలి ఉండగా విజయం సాధించారు. ఒక దశలో న్యూజిలాండ్ విజయం ఖాయంగా కనిపించినప్పటికీ, చివరి ఓవర్‌లో ఆట పూర్తిగా తలకిందులైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కంగారూలకు చివరి మూడు బంతుల్లో 8 పరుగులు కావాల్సి ఉండగా. యువ బ్యాట్స్‌మన్ జోష్ ఇంగ్లీస్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు.
చివరి ఓవర్‌లో ఆస్ట్రేలియా 13 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆల్ రౌండర్ కైల్ జేమ్సన్కు చివరి ఓవర్ అప్పగించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్ , అష్టన్ అగర్ క్రీజులో ఉన్నారు. జేమ్సన్ వేసిన తొలి బంతికే, స్టార్క్ అద్భుతమైన ఫోర్‌తో ఆస్ట్రేలియాను మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. కానీ స్టార్క్ రెండవ బంతిలో ఒక పరుగు మాత్రమే సాధించాడు. మూడో బంతికి అగర్ ఔటయ్యారు. ఆస్ట్రేలియాకు చివరి 3 బంతుల్లో 8 పరుగులు అవసరమయ్యాయి. జోష్ ఇంగ్లిస్ క్రీజులోకి వచ్చాడు. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన టీ 20 బ్లాస్ట్‌లో అత్యధికంగా 531 పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్‌లో ఇంగ్లిస్ 24 సిక్సర్లు కొట్టాడు. అదే జోరుతో అతను టీ 20 ప్రపంచకప్ జట్టులో చేరాడు. ఇంగ్లీస్ క్రీజులోకి వచ్చిన వెంటనే స్కూప్ షాట్ ద్వారా ఫోర్ కొట్టాడు. ఆస్ట్రేలియాకు ఇప్పుడు చివరి 2 బంతుల్లో 4 పరుగులు అవసరం. జేమ్సన్ యొక్క లెంగ్త్ డెలివరీలో ఇంగ్లీస్ బ్యాట్ తిప్పడంతో బంతి థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీ బాదాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.
అంతకు ముందు న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ 30, డారెల్ మిచెల్ 33, కేన్ విలియమ్సన్ 37 పరుగులు చేశారు. జిమ్మీ నీషమ్ కూడా చివరి ఓవర్‌లో 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మిచెల్ మార్ష్ 53 పరుగులు ఇచ్చాడు. ఆడమ్ జాంపా తన 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయానికొస్తే డేవిడ్ వార్నర్ తొలి బంతికే అవుట్ అయ్యాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్ చెరో 24 పరుగులు చేశారు. స్టీవ్ స్మిత్ 35 పరుగులు చేశాడు. మార్కస్ స్టోయినిస్ కూడా 28 పరుగులు అందించాడు. చివరి క్షణాల్లో అష్టన్ అగర్ 23 పరుగులు, మిచెల్ స్టార్క్ 13 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయానికి తమ వంతు సహకారం అందించారు.
Read Also.. T20 World Cup: ఓపెనర్లపై స్పష్టతనిచ్చిన విరాట్ కోహ్లీ.. వారిద్దరే ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని వెల్లడి..