పెర్త్ టెస్టులో అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో యువ ఆటగాడు నితీష్ రెడ్డి తన సత్తా చాటాడు. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో 41, 38* పరుగులు చేసి, ఒక వికెట్ కూడా తీసి, అతను జట్టు విజయానికి సాయపడడమే కాకుండా తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు.
తన క్రికెట్ ప్రయాణం గురించి మాట్లాడిన నితీష్ రెడ్డి తన చిన్నతనంలో ఆటను సీరియస్‌గా తీసుకోలేదని చెప్పాడు. కానీ ఆర్థిక కష్టాలు, తన తండ్రి కన్నీళ్లు అతనిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. “నా తండ్రి నా కోసం ఉద్యోగాన్ని వదిలాడు. ఒకసారి ఆయన ఏడుస్తున్నట్లు చూశాను, అప్పుడే నేను సీరియస్ కావాలని నిర్ణయించుకున్నాను. వారి త్యాగాలను వృథా చేయకూడదని నిశ్చయించుకున్నాను,” అని ఆవేదనతో చెప్పాడు.
తన తండ్రికి కృతజ్ఞతగా తన మొదటి టెస్ట్ జెర్సీని అందించిన నితీష్, తన తండ్రి ముఖంలో ఆనందం చూడటం అతనికి గర్వంగా అనిపించిందని అన్నాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, కష్టపడి సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నాడు.
కాన్‌బెర్రాలో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో సైతం ఆకట్టుకున్నాడు నితీష్. పెర్త్ టెస్టులో తను ఆడిన తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీతో కలిసి 77 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకోవడం తనకు కల నెరవేరినంత సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
విరాట్ కోహ్లీ తన బాల్యం నుంచే తనకు హీరో అని చెప్పిన నితీష్, కోహ్లీతో తన అరంగేట్ర మ్యాచ్‌లో కలిసి ఆడిన అనుభవాన్ని గురించి ఎంతో ఉద్వేగంతో మాట్లాడాడు. విరాట్ తన వంద పరుగుల మార్క్‌కు దగ్గరగా ఉంటే, అతను తన తొలి ఫిఫ్టీ దగ్గర ఆడుతున్నా అని గ్రహించలేదు అని అన్నాడు.
KL రాహుల్ ఇచ్చిన సలహాలు తన ఆటతీరును మెరుగుపర్చేందుకు ఎంతో ఉపయోగపడ్డాయని, అతని మాటలు నితీష్‌ను నైతికంగా బలపరిచాయని చెప్పాడు. మంచి ప్రదర్శనల కోసం తన ఆకలిని కొనసాగించాలనుకుంటున్నాను అని, తన ఆట త్రీ డైమెన్షన్‌లలో మెరుగుపరచి జట్టుకు ఎంతగానో తోడ్పడాలనుకుంటున్నాను అని తన భవిష్యత్తు లక్ష్యాలను నితీష్ వివరించాడు.
పింక్ బాల్ తో తన ప్రతిభను చూపించడానికి ఉత్సాహంగా ఉన్న నితీష్, క్రికెట్‌లో తన కృషితో కొత్త మైలురాళ్లు అందుకోవాలని సంకల్పబద్ధంగా ఉన్నాడు.
From idolising to manifesting and finally achieving ❤️
𝗡𝗞𝗥 – 𝗜𝘁’𝘀 𝗮 𝘁𝗮𝗹𝗲 𝗼𝗳 𝗮 𝗸𝗶𝗻𝗱 🌟
🎥 WATCH – Unearthing a gem: Tracing Nitish Kumar Reddy’s inspiring journey 👌👌 – By @RajalArora#TeamIndia | #AUSvIND
— BCCI (@BCCI) December 5, 2024