Nigar Sultana: హ్యాండ్‌షేక్ వివాదం.. కెప్టెన్సీ పోస్ట్‌కు గుడ్ బై చెప్పనున్న స్టార్ ప్లేయర్..!

Nigar Sultana Steps Down: బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్సీ మార్పునకు సిద్ధమైంది. జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు (Asian Games 2026) ప్రారంభానికి ముందే నిగర్ సుల్తానా పొట్టి ఫార్మాట్ నాయకత్వ బాధ్యతల ఉపసంహరణకు మొగ్గు చూపారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఆమె తన నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశారు.

Nigar Sultana: హ్యాండ్‌షేక్ వివాదం.. కెప్టెన్సీ పోస్ట్‌కు గుడ్ బై చెప్పనున్న స్టార్ ప్లేయర్..!
Nigar Sultana Steps Down

Updated on: Sep 15, 2026 | 9:31 PM

Nigar Sultana Steps Down: జపాన్‌లో ఆసియా క్రీడల పోటీలు ఆరంభం కానున్న తరుణంలో బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోవాలని నిర్ణయించుకున్న నిగర్ సుల్తానా, ఈ విషయాన్ని బోర్డుకు అధికారిక లేఖ ద్వారా తెలియజేశారు. తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలపై మరింత ఏకాగ్రత పెట్టే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ వన్డే (One Day International – ODI) ఫార్మాట్‌లో మాత్రం ఆమె సారథిగా కొనసాగనున్నారు. బీసీబీ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) ఆమె ప్రతిపాదనను ఆమోదించినట్లు సమాచారం. ఇటీవల ముగిసిన మహిళల ఆసియా కప్ 2026 (Women’s Asia Cup 2026) సందర్భంగా భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తో టాస్ సమయంలో కరచాలనం చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎక్కువమంది చదివినది: వైభవ్ ఆటకట్టిస్తాం.. పక్కాప్లాన్‌తో దూల తీర్చేస్తాం..: జపాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!

ఆ వివాదంపై స్పందించిన బోర్డు అధికారి రఫీకుల్ ఇస్లాం బాబు (Rafiqul Islam Babu), అది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని, అన్ని దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. నాయకత్వ గణాంకాలను పరిశీలిస్తే, 2022 సంవత్సరంలో టీ20 పగ్గాలు చేపట్టిన సుల్తానా ఆధ్వర్యంలో బంగ్లా జట్టు కొన్ని చిరస్మరణీయ విజయాలు సాధించింది. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచకప్ (T20 World Cup) లో స్కాట్లాండ్‌పై గెలుపొంది పదేళ్ల తర్వాత తొలి ప్రపంచకప్ విజయాన్ని నమోదు చేసింది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: మేమైతే గెలిచాం.. అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే: శ్రేయాస్ అయ్యర్

మొత్తంగా 2022-2026 కాలంలో ఆమె కెప్టెన్సీ కింద బంగ్లాదేశ్ 80 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో జట్టు 32 విజయాలు సాధించగా, 47 మ్యాచ్‌లలో ఓటమి చవిచూసింది, ఒక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. ఆమె సారథ్యంలో గెలుపు శాతం 40 శాతంగా, ఓటమి శాతం 58.75 శాతంగా నమోదైంది. జపాన్ వేదికగా కొత్త సారథ్యంతో బరిలోకి దిగేందుకు బంగ్లాదేశ్ సమాయత్తమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us