AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 మ్యాచ్‌ల్లో 11.. శ్రేయస్ అయ్యర్ సరికొత్త ప్రపంచ రికార్డ్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Shreyas Iyer Toss Record: భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌లో ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అఫ్గానిస్థాన్ (Afghanistan) జట్టుతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టాస్ గెలవడం ద్వారా, కెప్టెన్‌గా తొలి 12 టీ20 మ్యాచ్‌లలో అత్యధిక టాస్‌లు గెలిచిన సారథిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు.

Venkata Chari
|

Updated on: Sep 15, 2026 | 9:05 PM

Share
Shreyas Iyer Toss Record: అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో భారత సారథి శ్రేయస్ అయ్యర్ అరుదైన మైలురాయిని అధిగమించాడు. సెప్టెంబర్ 15న ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆయన, కెప్టెన్‌గా తన తొలి 12 టీ20 మ్యాచ్‌లలో ఏకంగా 11 సార్లు టాస్ గెలిచిన ఏకైక సారథిగా నిలిచాడు.

1 / 6
గతంలో ఖతార్ క్రికెటర్ మీర్జా బేగ్, ఫిలిప్పీన్స్ కెప్టెన్ హెన్రీ టైలర్ చెరో 10 విజయాలతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగగా, తాజా ప్రదర్శనతో అయ్యర్ వారిద్దరినీ అధిగమించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. పూర్తి స్థాయి ఐసీసీ సభ్య దేశాల జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan - 9 టాస్ విజయాలు) పేరిట ఉన్న రికార్డు సైతం కనుమరుగైంది.

2 / 6
ప్రపంచకప్ విజేత సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తరువాత భారత పొట్టి ఫార్మాట్ పగ్గాలు చేపట్టిన అయ్యర్, జూన్ 26 - జులై 11 మధ్య ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఆడిన మొత్తం 7 మ్యాచ్‌లలోనూ వరుసగా టాస్‌లు గెలిచాడు.

3 / 6
జులైలో జరిగిన జింబాబ్వే (Zimbabwe) పర్యటనలోని రెండో మ్యాచ్‌లో మాత్రమే ఆయన తన కెరీర్‌లో ఏకైక టాస్ ఓడిపోయాడు. ఆ తరువాత అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలోనూ వరుసగా కాయిన్ ఆయన వైపే మొగ్గు చూపింది.

4 / 6
టాస్ పరంగా తిరుగులేని రికార్డు నెలకొల్పినప్పటికీ, మ్యాచ్ ఫలితాల పరంగా అయ్యర్ సారథ్యం మిశ్రమంగా సాగింది. ఐర్లాండ్‌పై 0-2తో, ఇంగ్లండ్‌పై 0-4తో సిరీస్‌లు కోల్పోయిన భారత్, అనంతరం జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి తొలి సిరీస్ విజయం అందుకుంది.

5 / 6
ప్రస్తుతం అఫ్గాన్‌పై కూడా ఆ దూకుడును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన 10 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, ఆరు ఓటములు నమోదైనప్పటికీ, టాస్ లక్ విషయంలో మాత్రం అయ్యర్ సరికొత్త చరిత్రను లిఖించారు.

6 / 6
Follow Us
నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లకు కొత్త రూల్స్.. ఇవి తప్పనిసరి

దీపావళికి ఇళ్లు క్లీన్ చేస్తున్న యజమాని.. కిటికీ ఓపెన్ చేయగా..

పన్నీర్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అమ్మకాలపై ఏడాదిపాటు బ్యాన్..

Video: రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ.. స్పెయిన్‌లో 68 మంది మృతి!

కర్వా చౌత్.. చంద్రోదయం సమయం, పూజా ముహూర్తం, వ్రత నియమాలు ఇవే!

35 ఏళ్ల తర్వాత అద్భుతం.. అసలెవరీ నయా ఆల్ రౌండర్..!

స్క్రీన్ చూస్తుంటే కళ్ల నుంచి నీళ్లు వస్తున్నాయా? కారణం ఇదే!

రైతులకు కేంద్రం బ్యాడ్‌న్యూస్. 10 లక్షల మందికి పీఎం కిసాన్ కట్..!

పరగడుపున కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..? శరీరంలో జరిగే మార్పులివే!

బియ్యంలో పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో అస్సలు రావు