క్రికెట్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. మిమ్మల్ని అలరించేందుకు మరో టోర్నమెంట్ వచ్చేస్తోంది. సిక్సర్ల మోత.. బౌండరీ కోత.. ఈ టోర్నీ అట్లాంటి.. ఇట్లాంటిది కాదు.. అందరూ హార్డ్ హిట్టర్‌లే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్.. జూలై 3వ తేదీన యూకేలోని బర్మింగ్‌హామ్, ఎడ్జ్‌బాస్టన్ వేదికలుగా ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతోంది. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. యువరాజ్ సింగ్, షాహిద్ అఫ్రిది, బ్రెట్ లీ, ఇయాన్ బెల్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, డారెన్ సామీ వంటి దిగ్గజ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. ఇక ఈ టోర్నమెంట్‌కు అఫీషియల్ పార్ట్‌నర్ EaseMyTrip కాగా, అఫీషియల్ డిజిటల్ పార్ట్‌నర్లుగా న్యూస్ 9 ప్లస్, టీవీ9 నెట్‌వర్క్ వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ టోర్నమెంట్‌లో భాగస్వామ్యమయ్యాడు. ఇటీవలే విడుదలైన ప్రోమోను లేట్ ఎందుకు మీరూ చూసేయండి..
ఇది చదవండి: కసి తీర్చుకుంటున్న కావ్య మారన్.. మెగా వేలంలోకి కమిన్స్‌తో పాటు ఆ ఇద్దరూ.. రిటైన్ లిస్టు ఇదే!
ఇది చదవండి: కోట్లు ఖర్చయినా పర్లేదు.. మెగా వేలంలోకి రోహిత్, కోహ్లీ, మ్యాక్స్‌వెల్.! ఈసారి మోత మోగాల్సిందే..
మరిన్ని క్రికెట్ వార్తలు ఇక్కడ క్లిక్ చేయండి..