Video: న్యూజిలాండ్ జట్టులో మనోడు.. చేతిపై ఆ టాటూతో స్పెషల్ అట్రాక్షన్.. టీమిండియాకు షాకిస్తానంటూ
IND vs NZ: న్యూజిలాండ్‌లో నివసిస్తున్నప్పటికీ ఆదిత్య తరచూ భారత్‌కు వస్తుంటాడు. గతేడాది అతను కొన్ని వారాల పాటు చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన సీఎస్‌కే (CSK) అకాడమీలో శిక్షణ పొందాడు. అక్కడ ఎర్రమట్టి, బంకమట్టి పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తాయో అన్న విషయంపై ప్రత్యేకంగా అవగాహన పెంచుకున్నాడు.

Adithya Ashok: జనవరి 11 నుంచి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపికైన కివీస్ జట్టులో ఒక ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది. ఆయనే యువ లెగ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్. న్యూజిలాండ్ తరపున ఆడుతున్నప్పటికీ, ఈ కుర్రాడికి భారత దేశంతో, ముఖ్యంగా తమిళనాడుతో విడదీయలేని అనుబంధం ఉంది.
వేలూరు నుంచి ఆక్లాండ్ వరకు..
ఆదిత్య అశోక్ స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు. ఆదిత్యకు కేవలం నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు న్యూజిలాండ్‌కు వలస వెళ్లారు. అక్కడే పెరిగిన ఆదిత్య, చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. క్రమంగా తన ప్రతిభతో న్యూజిలాండ్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
తాత జ్ఞాపకార్థం ప్రత్యేక టాటూ..
ఆదిత్యకు తన తాతయ్యతో చాలా విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన మరణం తర్వాత, తన తాతకు గుర్తుగా తన బౌలింగ్ చేసే చేతిపై ఒక ప్రత్యేకమైన టాటూ వేయించుకున్నాడు. ‘నా దారి ప్రత్యేక దారి’ అంటూ తమిళ అక్షరాలతో ఉన్న ఈ టాటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తన మూలాలను, భాషను తను ఎంతగా ప్రేమిస్తాడో తెలియజేస్తుంది.
చెన్నైలో శిక్షణ – పిచ్‌లపై అవగాహన..
Adithya Ashok 3 wickets for NZ-A vs SA-A pic.twitter.com/aMQ1iYN8So
— The Niche Cache (@thenichecache) August 30, 2025
ఆదర్శం షేన్ వార్న్.. అండగా ఇష్ సోధీ: ఆదిత్యకు ఆల్-టైమ్ ఫేవరెట్ స్పిన్నర్ దివంగత లెజెండ్ షేన్ వార్న్. అయితే, న్యూజిలాండ్ జట్టులో తన సీనియర్, మరో భారతీయ మూలాలున్న స్పిన్నర్ ఇష్ సోధీతో తనకు ఉన్న అనుబంధాన్ని ఆదిత్య ప్రత్యేకంగా చెప్పుకున్నాడు. “ఇష్ సోధీ నాకు ఒక పెద్దన్న లాంటివాడు. అతని బౌలింగ్ చూస్తూనే నేను పెరిగాను. ఇప్పుడు అతనితో కలిసి ఆడటం గొప్ప అనుభవం” అని ఆదిత్య తెలిపాడు. “చెన్నైలో గడిపిన సమయం నాకు చాలా విషయాలు నేర్పింది. ఇక్కడి పరిస్థితులు నాకు బాగా తెలుసు” అని ఆదిత్య ధీమా వ్యక్తం చేశాడు.
వచ్చే టీ20 సిరీస్‌లో ఈ భారతీయ సంతతి కుర్రాడు భారత బ్యాటర్లను ఎలా ముప్పుతిప్పలు పెడతాడో చూడాలి మరి!
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




