
India vs New Zealand, 2nd Test: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా నేటి నుంచి పుణె వేదికగా రెండో మ్యాచ్ జరుగుతోంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ స్టేడియంలో ఇరు జట్లు తొలిసారిగా టెస్ట్‌లో తలపడనున్నాయి.
మాట్ హెన్రీ స్థానంలో కెప్టెన్ టామ్ లాథమ్ మిచెల్ సాంట్నర్‌కు అవకాశం కల్పించాడు. అదే సమయంలో భారత జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగింది. శుభ్‌మన్ గిల్, ఆకాశ్ దీప్‌లు పునరాగమనం చేయగా, వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం లభించింది. మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లను ప్లేయింగ్-11 నుంచి తప్పించారు.
ఈ స్టేడియంలో ఇరు జట్లు తొలిసారిగా టెస్ట్‌లో తలపడనున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 0-1తో వెనుకంజలో ఉంది. న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, ఈ పరాజయం ఉన్నప్పటికీ, WTC పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో ఉంది.
సిరీస్‌లో పునరాగమనం చేయడానికి, WTC ఫైనల్‌ను దృష్టిలో ఉంచుకోవడానికి టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ WTC సైకిల్‌లో భారత జట్టుకు 7 మ్యాచ్‌లు (2 న్యూజిలాండ్, 5 ఆస్ట్రేలియా) మిగిలి ఉన్నాయి. ఇతర జట్లపై ఆధారపడకుండా WTC ఫైనల్ ఆడాలంటే, భారత జట్టు ఈ మ్యాచ్‌లలో 4 గెలిచి 2 డ్రా చేసుకోవాలి.
🚨 Toss Update 🚨
New Zealand win the toss and elect to bat in the 2nd Test in Pune.
Live – https://t.co/YVjSnKCtlI#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/LCj6ActryZ
— BCCI (@BCCI) October 24, 2024
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలోని పిచ్ బౌలర్లకు ఎంతగానో సహకరిస్తుంది. ఇక్కడ స్పిన్నర్లు ఖచ్చితంగా సహాయం పొందుతారు. రెండో టెస్టు పిచ్ స్లో టర్నర్ కావచ్చు. నివేదిక ప్రకారం, పిచ్ కోసం నల్ల మట్టిని ఉపయోగించారు. దీని కారణంగా, బెంగళూరుతో పోలిస్తే పూణేలో తక్కువ బౌన్స్ కనిపించవచ్చు. ఈ స్టేడియంలో ఇప్పటివరకు 2 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. భారత జట్టు 1, ఆస్ట్రేలియా టీం 1 గెలిచాయి. అయితే, ఈ పిచ్‌లో నాలుగో ఇన్నింగ్స్ ఆడడం చాలా కష్టంగా మారుతుంది. దీంతో భారత్ టాస్ ఓడిపోవడంతో, నాలుగో ఇన్నింగ్స్ ఆడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో తొలి టెస్ట్‌లో టాస్ గెలిచి చేజేతులా ఓటమి కొని తెచ్చుకున్న భారత్.. రెండో టెస్ట్‌లో టాస్ ఓడిపోయి ఓటమిని తెచ్చుకునేలా ఉంది. మరి ఈ టెస్ట్‌లో భారత్ ఎలా రీఎంట్రీ ఇస్తుందో చూడాలి.
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..