NZ vs SL: బాధను కలిగించే వారే సానుభూతిపరులుగా మారితే.. వినడానికి చాలా బాగుంది కదా.. అచ్చం ఇదే విషయం టీమిండియాకు జరిగింది. WTCలో భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో.. ఇదే విషయం వెలుగులోకి వచ్చింది. నిన్నటి వరకు నేటి ఉదయం వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ చోటు కోసం టీమిండియా ఎదురుచూడాల్సి వచ్చింది. 628 రోజుల క్రితం టీమిండియాకు ఓటమి కలిగించిన వారే.. ఇప్పుడు WTC రెండో సీజన్‌లో ఫైనల్ చేరేలా చేశారు. అదేంటని ఆలోచిస్తున్నారా… అక్కడికే వస్తున్నాం.. డబ్యూటీసీ మొదటి సీజన్‌లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలవకుండా అడ్డుకున్న న్యూజిలాండ్.. 2 సంవత్సరాల తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు సహాయం చేసింది.
628 రోజుల క్రితం అంటే 23 జూన్ 2021న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి ఫైనల్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సౌతాంప్టన్ ఓటమి ఎదురైంది. దీంతో విజేతగా న్యూజిలాండ్ జట్టు నిలిచింది. అయితే, ఈసారి న్యూజిలాండ్ టీం WTC టైటిల్‌కు చాలా దూరంలో నిలిచింది. కానీ, శ్రీలంక టీం మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు టీమిండియాకు గట్టిపోటీ ఇస్తూ వచ్చింది. ఇలాంటి హోరాహోరీ పోరులో లంక తొలి టెస్టులో ఓటమిపాలైంది. దీంతో టీమిండియా టిక్కెట్ ఖరారైంది.
క్రైస్ట్‌చర్చ్‌లో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో WTC ఫైనల్‌కు టీమిండియా టిక్కెట్‌ను నిర్ధారించింది. దీంతో ఈ ఏడాది జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా-భారత్ మధ్య పోటీ జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..