Gautam Gambhir: గొప్ప మనసు చాటుకున్న గౌతమ్‌ గంభీర్‌.. ఇబ్బందుల్లో ఉన్న మాజీ క్రికెటర్‌ కోసం ఏం చేశాడంటే?

|

May 10, 2023 | 6:15 AM

అగ్రెసివ్‌ పర్సన్‌గా పేరున్న గంభీర్‌ తనలోనూ గొప్ప మనసు దాగుందని చాలా సార్లు రుజువు చేశాడు. ఢిల్లీలో 100 మంది నిరుపేదలకు నిత్యం అన్నదానం చేస్తున్న గంభీర్.. కరోనా కాలంలోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టాడు. తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నాడీ లెజెండరీ క్రికెటర్‌.

Gautam Gambhir: గొప్ప మనసు చాటుకున్న గౌతమ్‌ గంభీర్‌.. ఇబ్బందుల్లో ఉన్న మాజీ క్రికెటర్‌ కోసం ఏం చేశాడంటే?
Gautam Gambhir
Follow us on

టీమిండియా మాజీ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్, ఎంపీ గౌతమ్ గంభీర్ ఇటీవల విరాట్‌ కోహ్లీతో గొడవపడి వార్తల్లో నిలిచాడు. ఇందులో గౌతీదే తప్పని కొందరంటే మరికొందరు మాత్రం కోహ్లీదే తప్పని నెట్టింట తెగ వాదించుకున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఇద్దరికీ జరిమానా విధించింది. కాగా అగ్రెసివ్‌ పర్సన్‌గా పేరున్న గంభీర్‌ తనలోనూ గొప్ప మనసు దాగుందని చాలా సార్లు రుజువు చేశాడు. ఢిల్లీలో 100 మంది నిరుపేదలకు నిత్యం అన్నదానం చేస్తున్న గంభీర్.. కరోనా కాలంలోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టాడు. తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నాడీ లెజెండరీ క్రికెటర్‌. వివరాల్లోకి వెళితే.. టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ శర్మ అత్తగారు తీవ్ర అనారోగ్యం పాలైంది. ఈ విషయం తెలుసుకున్న గౌతీ తన వంతు సాయం చేశాడు. ఈ విషయాన్ని తాజాగా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు రాహుల్‌ శర్మ. ‘గత నెల మాకు ఎంతో కష్టంగా గడిచింది. మా అత్తగారికి బ్రెయిన్ హ్యామరేజీ వచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా మారింది. కష్ట కాలంలో గంభీర్ అన్న మాకు సహాయం చేశాడు. అతి తక్కువ సమయంలోనే బెస్ట్ న్యూరాలజిస్ట్, హాస్పిటల్‌ను నాకు అందించారు. మా అత్తగారికి విజయవంతంగా సర్జరీ చేశారు. ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది. సాయం చేసిన గంభీర్ అన్నకు, ఆయన పీఏ గౌరవ్ అరోరాకు ధన్యవాదాలు. మా అత్తమ్మను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న గంగారాం హాస్పిటల్‌కు, వారి సిబ్బందికి ధన్యవాదాలు. ప్రత్యేక పర్యవేక్షణతో చికిత్స అందించిన డాక్టర్ మనీష్ చుగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశాడు రాహుల్ శర్మ. ఈ సందర్భంగా తన భార్య, అత్తతో కలిసి దిగిన ఫొటోలను కూడా షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గౌతమ్‌ గంభీర్‌ చేసిన చాలా మంచి పని చేశారంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రాహుల్‌ శర్మ విషయానికొస్తే..భారత జట్టు తరుపున 4 వన్డేలు, 2 టీ20 మ్యాచులు ఆడాడు. అయితే బెల్‌ పాల్సీ అని పిలిచే ముఖ పక్షవాతంతో బాధపడిన రాహుల్‌ ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో నిలదొక్కుకోలేక పోయాడు. ఇక ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, పూణే వారియర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్లకు ప్రాతినిథ్య వహించాడు. అయితే ఓ సీజన్‌లో సౌతాఫ్రికా క్రికెటర్ వేర్న్ పార్నెల్‌తో కలిసి రేవ్ పార్టీలో పాల్గొన్న డ్రగ్స్ తీసుకున్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది. ఈ సంఘటన తర్వాత పూర్తిగా క్రికెట్‌కి దూరమైన రాహుల్ శర్మ గతేడాది ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..