T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. టీమ్‌లో తెలుగు కుర్రాడికి స్థానం

|

May 14, 2024 | 6:05 PM

అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న డచ్ క్రికెట్ జట్టు ICC T20 ప్రపంచ కప్ 2024 కోసం తమ జట్టును ప్రకటించింది. మంగళవారం (మే 14) నాడు మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీని ప్రకారం, స్కాట్ ఎడ్వర్డ్స్ నెదర్లాండ్స్‌కు సారథ్యం వహించనున్నాడు. అలాగే, ఈ జట్టులో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. టీమ్‌లో తెలుగు కుర్రాడికి స్థానం
Netherlands Cricket Team
Follow us on

అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న డచ్ క్రికెట్ జట్టు ICC T20 ప్రపంచ కప్ 2024 కోసం తమ జట్టును ప్రకటించింది. మంగళవారం (మే 14) నాడు మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దీని ప్రకారం, స్కాట్ ఎడ్వర్డ్స్ నెదర్లాండ్స్‌కు సారథ్యం వహించనున్నాడు. అలాగే, ఈ జట్టులో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నారు. విక్రమ్ సింగ్, ఆర్యన్ దత్, తేజ నిడమనూరు ఉన్నారు. ఇందులో తేజ నిడమానురు తెలుగు కుర్రాడు కావడం విశేషం. తేజ నిడమనూరు ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించారు. విక్రమ్‌జిత్ సింగ్ జన్మస్థలం పంజాబ్‌లోని చీమా ఖుర్ద్. విక్రమ్‌జిత్ 7 సంవత్సరాల వయస్సులో నెదర్లాండ్స్‌కు వెళ్లాడు. ఇక ఆర్యన్ దత్ కూడా భారత సంతతికి చెందిన వాడే. ఆర్యన్ కుంటుబియాలు పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందినవారు. వారు 1980లో నెదర్లాండ్స్‌ కు వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. అయితే ప్రపంచ కప్ జట్టు నుంచి ఆల్ రౌండర్ రోలోఫ్ వాన్ డెర్ మెర్వ్ , స్టార్ బ్యాటర్ కెలిన్ అకెర్‌మాన్ ఇద్దరికీ ప్రపంచ కప్ జట్టులో స్థానం దక్కలేదు. వీరిద్దరూ ప్రపంచకప్‌కు అందుబాటులో లేకపోవడంతో వారిని చేర్చలేదు.

కాగా 2009 టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఆ తర్వాత 2014 సంవత్సరంలో నెదర్లాండ్స్ దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. అందుకే ఇప్పుడు వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 టోర్నీలో నెదర్లాండ్స్ ఎవరిని ఓడించి సంచలనం సృష్టిస్తుందోనని అభిమానులు అంచనాలు వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచకప్ కోసం నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు గ్రూప్ డిలో చేర్చారు. ప్రపంచకప్‌లో 20 జట్లు తలపడనున్నాయి. ఈ 20 జట్లను 5-5 ప్రాతిపదికన 4 గ్రూపులుగా విభజించారు. దీని ప్రకారం, నెదర్లాండ్స్ గ్రూప్ డిలో ఉంది. నెదర్లాండ్స్‌తో పాటు, ఈ గ్రూప్‌లో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా ఉన్నాయి. నెదర్లాండ్స్ తమ ప్రపంచకప్ పోరాటాన్ని నేపాల్‌తో ప్రారంభించనుంది.

T20 ప్రపంచ కప్ 2024 కోసం నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు:

స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడే, డేనియల్ డోరమ్, ఫ్రెడ్ క్లాసెన్, కైల్ క్లీన్, లోగాన్ వాన్ బీక్, మాక్స్ ఓ’డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, సైబ్రాండ్ ఎంగెల్బ్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్,వెస్లీ బరేసి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..