AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నీ పోరాట స్ఫూర్తికి హ్యాట్సాఫ్‌’.. నొప్పిని భరిస్తూ, కుంటుతూనే బ్యాటింగ్‌ చేసిన స్టార్ క్రికెటర్.. వైరల్ వీడియో

క్రికెట్‌లో గాయాలు సహజమే. ఒక్కోసారి ఇవి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే జెంటిల్మెన్‌ గేమ్‌గా భావించే క్రికెట్‌లో పోరాటస్ఫూర్తికి కొదవేం లేదు. బెర్ట్ సట్‌క్లిఫ్, అనిల్ కుంబ్లే, గ్రేమ్ స్మిత్ ఇలా ఎంతో మంది గాయాలతోనే గ్రౌండ్‌లోకి దిగారు. తమ జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు.

'నీ పోరాట స్ఫూర్తికి హ్యాట్సాఫ్‌'.. నొప్పిని భరిస్తూ, కుంటుతూనే బ్యాటింగ్‌ చేసిన స్టార్ క్రికెటర్.. వైరల్ వీడియో
Nathan Lyon
Basha Shek
|

Updated on: Jul 02, 2023 | 5:10 PM

Share

క్రికెట్‌లో గాయాలు సహజమే. ఒక్కోసారి ఇవి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ చేయడం చాలా కష్టమవుతుంది. అయితే జెంటిల్మెన్‌ గేమ్‌గా భావించే క్రికెట్‌లో పోరాటస్ఫూర్తికి కొదవేం లేదు. బెర్ట్ సట్‌క్లిఫ్, అనిల్ కుంబ్లే, గ్రేమ్ స్మిత్ ఇలా ఎంతో మంది గాయాలతోనే గ్రౌండ్‌లోకి దిగారు. తమ జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఇప్పుడీ జాబితాలోకి ఆస్ట్రేలియా ఆఫ్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ చేరాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజు లయోన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతను డ్రెస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యాడు. అయితే నాలుగోరోజు నాలుగో రోజు ఆస్ట్రేలియా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది. అప్పటికే జట్టు కూడా గణనీయమైన ఆధిక్యాన్ని సాధించింది. అయితే వరుసగా వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా ఆధిక్యం 355 పరుగులకు చేరుకోగా, తొమ్మిదో వికెట్ పడింది. దీంతో మ్యాచ్ రెండో రోజు గాయపడిన చివరి బ్యాటర్‌ నాథన్ లియాన్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు. అయితే జట్టుకు తన అవసరం ఉండడంతో ఏ మాత్రం సంకోచించకుండా బ్యాటింగ్‌కు వచ్చాడు నాథన్‌. నొప్పిని భరిస్తూ కుంటుతూ మైదానంలోకి వస్తుంటే స్టేడియంలోని ప్రేక్షకులంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇక ఔటై వెళ్లిపోతున్నప్పుడు కూడా చప్పట్లు కొడుతూ స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు.

మిచెల్‌ స్టార్క్‌తో కలిసి ఆఖరి వికెట్‌ఖు 15 పరుగులు జోడించారు లయోన్‌. దీని ఆధారంగా ఇంగ్లండ్ ముందు ఆస్ట్రేలియా 371 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇది చిన్న భాగస్వామ్యమే కావచ్చు.. కానీ గాయాన్ని లెక్కచేయకుండా బ్యాటింగ్‌ చేసిన లయోన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్‌ ఆటగాడి పోరాట స్ఫూర్తి, ఆట పట్ల అతనికున్న కమిట్మెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం నాథన్‌ లయోన్‌ బ్యాటింగ్‌కు వస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలతో తెగ వైరలవుతున్నాయి. కాగా ఈ టెస్టులోనూ ఆసీస్‌ విజయం దిశగా సాగుతోంది. కడపటి వార్తలందే సమయానికి ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి178 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఆ జట్టు ఇంకా 193 పరుగులు చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్