Video: అన్నతోపాటు విఫలమైన స్టార్ ప్లేయర్లు.. కట్‌చేస్తే.. అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ బాదిన ‘తమ్ముడు’

|

Sep 06, 2024 | 12:14 PM

Musheer Khan Century: దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ మ్యాచ్‌ల మొదటి రోజు, ఫాస్ట్ బౌలర్లు బ్యాట్స్‌మెన్స్‌పై విధ్వంసం సృష్టించారు. బౌలర్ల తుఫాన్ మధ్య యువ బ్యాట్స్ మెన్ ముషీర్ ఖాన్ అండగా నిలిచి అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇండియా-బి తరపున ఆడుతూ, 19 ఏళ్ల ముషీర్ ఇండియా-ఎపై ఈ సెంచరీని సాధించి కష్టాల్లో ఉన్న తన జట్టును మెరుగైన స్థితికి తీసుకొచ్చాడు.

Video: అన్నతోపాటు విఫలమైన స్టార్ ప్లేయర్లు.. కట్‌చేస్తే.. అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ బాదిన తమ్ముడు
Musheer Khan Century
Follow us on

Musheer Khan Century: దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ మ్యాచ్‌ల మొదటి రోజు, ఫాస్ట్ బౌలర్లు బ్యాట్స్‌మెన్స్‌పై విధ్వంసం సృష్టించారు. బౌలర్ల తుఫాన్ మధ్య యువ బ్యాట్స్ మెన్ ముషీర్ ఖాన్ అండగా నిలిచి అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇండియా-బి తరపున ఆడుతూ, 19 ఏళ్ల ముషీర్ ఇండియా-ఎపై ఈ సెంచరీని సాధించి కష్టాల్లో ఉన్న తన జట్టును మెరుగైన స్థితికి తీసుకొచ్చాడు. ఇటువంటి పరిస్థితిలో అతని సెంచరీ చేశాడు. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, ముషీర్ అన్న సర్ఫరాజ్ ఖాన్ వంటి టీమిండియా బ్యాట్స్‌మెన్లు చౌకగా ఔటయ్యారు. విశేషమేమిటంటే.. దులీప్ ట్రోఫీలో ముషీర్‌కి ఇదే అరంగేట్రం. ఈ మ్యాచ్‌లోనే అతను ఈ సెంచరీ సాధించాడు.

ఘోరంగా విఫలమైన స్టార్ ప్లేయర్లు..

బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత్‌ బి జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఇండియా ఎ ఫాస్ట్ బౌలర్లు ప్రభావవంతమైన బౌలింగ్‌ను ప్రదర్శించారు. ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ మొత్తం టాప్, మిడిల్ ఆర్డర్‌ను భయభ్రాంతులకు గురిచేశారు. యశస్వి జైస్వాల్ (30), రిషబ్ పంత్ (7), సర్ఫరాజ్ ఖాన్ (9) వంటి బ్యాట్స్‌మెన్స్ పెద్ద స్కోరు చేయడంలో విఫలమవ్వగా, ఇండియా బి కెప్టెన్, అనుభవజ్ఞుడైన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (13) కూడా చౌకగా ఔటయ్యాడు. ఇలాంటి పరిస్థితిలో ముషీర్ ఇన్నింగ్స్ ను చేజిక్కించుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ముషీర్ అద్భుత సెంచరీ, మద్దతుగా నిలిచిన సైనీ..

ముషీర్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతని కళ్ల ముందే జట్టు స్కోరు 94 పరుగుల వద్ద 7 వికెట్లు పడిపోయాయి. ఇలాంటి సమయంలో 9వ నంబర్ బ్యాట్స్‌మెన్ నవదీప్ సైనీ (ఫాస్ట్ బౌలర్) ముషీర్‌తో కలిసి క్రీజులోకి వచ్చి ఇక్కడ నుంచి అండగా నిలిచాడు. ముషీర్ చాలా నెమ్మదిగా ప్రారంభించాడు. కానీ, వికెట్లు పడటం ప్రారంభించినప్పుడు, అతను వీలైనన్ని ఎక్కువ పరుగులు జోడించడానికి ప్రయత్నించాడు. పరుగుల వేగాన్ని పెంచాడు.

ఈ సమయంలో, అతను మొదట హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 204 బంతుల్లో చిరస్మరణీయ సెంచరీని సాధించాడు. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇది మూడో సెంచరీ. ముషీర్ కూడా సైనీతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును 200 పరుగులు దాటించాడు. తొలిరోజు ఆట ముగిసే వరకు ముషీర్ (105), సైనీ (29) క్రీజులో నిలవడంతో ఆ జట్టు 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది.

అక్షర్ పటేల్ ధాటిగా ఆడినా ఇండియా-డి విఫలం

మరోవైపు అనంతపురంలో ఇండియా-సి, ఇండియా-డి మధ్య మ్యాచ్ కూడా ప్రారంభం కాగా ఇక్కడ కూడా ఫాస్ట్ బౌలర్ల హవా కనిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-డి కేవలం 164 పరుగులకే ఆలౌటైంది. అందుకు అక్షర్ పటేల్ 86 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దాని ఆధారంగానే జట్టు ఇక్కడికి చేరుకోగలిగింది. ఇండియా-సి తరపున పేసర్ విజయ్‌కుమార్ వైషాక్ 3 వికెట్లు, అన్షుల్ కాంబోజ్ 2 వికెట్లు తీశారు. దీనికి సమాధానంగా ఇండియా సి కూడా కేవలం 43 పరుగులకే తన టాప్ 4 బ్యాట్స్‌మెన్స్ వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత అభిషేక్ పోరెల్ (32), బాబా ఇందర్‌జీత్ (15) ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకోవడంతో జట్టు స్కోరు 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..