
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్లేఆఫ్స్ ఫార్మాట్ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, చివరగా ఫైనల్.. ఇలా అన్నీ ఉత్కంఠను రేకెత్తిస్తాయి. క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. కాగా ఓడిపోయిన జట్టుకు క్వాలిఫైయర్ 2లో మరో అవకాశం లభిస్తుంది. అయితే, క్వాలిఫైయర్ 1లో ఓడిపోయినప్పటికీ, ఆ తర్వాత పుంజుకుని ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న జట్లు ఎన్ని ఉన్నాయో తెలుసా?
ఐపీఎల్ చరిత్రలో క్వాలిఫైయర్ 1లో ఓడిపోయి, ఆ తర్వాత క్వాలిఫైయర్ 2లో గెలిచి, ఫైనల్‌లోనూ విజయం సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయిన జట్టు ఒకటే ఉంది. అది కూడా ఈ జట్టే రెండుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ అద్భుతమైన ఘనతను సాధించిన జట్టు ముంబై ఇండియన్స్ మాత్రమే. అవును, ముంబై ఇండియన్స్ రెండుసార్లు ఈ ఫీట్‌ను సాధించింది.
పంజాబ్ కింగ్స్ (PBKS) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్ 1లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ పోటీకి మాత్రం దూరంగా లేరు. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచినందున, ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలను కలిగి ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, పంజాబ్ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఇంకా ఉంది. క్వాలిఫయర్ 2లో ఎలిమినేటర్ విజేతను ఓడించాల్సి ఉంటుంది. ఇలా చేయగలిగితే 11 సంవత్సరాలలో మొదటిసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంటారు. ఇలా చేసి ఫైనల్ గెలిస్తే, ఐపీఎల్ చరిత్రలో క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన తర్వాత టైటిల్ గెలుచుకున్న రెండవ జట్టుగా నిలుస్తుంది.
ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఫార్మాట్ నిజంగానే జట్లకు గెలిచే అవకాశాలను అందిస్తుంది. క్వాలిఫైయర్ 1లో ఓడిపోయినప్పటికీ, రెండో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ అద్భుతమైన ప్రదర్శన క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..