కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ టీం 19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-16లో భాగంగా 16 వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌కు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ తరపున డేవిడ్ వార్నర్ 47 బంతుల్లో 51 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇరు జట్లూ తొలి విజయంపై కన్నేశాయి.
ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముంబైపై ఫిఫ్టీ చేశాడు. ఈ ఇన్నింగ్స్ కూడా చాలా నెమ్మదిగా సాగింది. 43 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇది 58వ ఫిఫ్టీ. ఐపీఎల్‌లో అత్యధిక ఫిఫ్టీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.
టాస్ ఓడిపోయిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేయగా, పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ చురుకైన ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 10 బంతుల్లో 15 పరుగులు చేసి షా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మనీష్ పాండేతో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ను పొడిగించడంతో జట్టు 6 ఓవర్లలో 51 పరుగులు చేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..