DC vs MI: సూరీడు మెరిసినా, తడబడిన ముంబై.. ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్..?

Delhi Capitals vs Mumbai Indians, 8th Match, Indian Premier League 2026: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. రోజులోని మొదటి మ్యాచ్‌లో, ఢిల్లీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

DC vs MI: సూరీడు మెరిసినా, తడబడిన ముంబై.. ఢిల్లీ ముందు స్వల్ప టార్గెట్..?
Dc Vs Mi Score Update

Updated on: Apr 04, 2026 | 5:19 PM

Delhi Capitals vs Mumbai Indians, 8th Match, Indian Premier League 2026: ఐపీఎల్ 19వ సీజన్‌లోని తొలి డబుల్ హెడర్ నేడు జరుగుతోంది. తొలి మ్యాచ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. మిచెల్ శాంట్నర్ 18, కార్బిన్ బాష్ 1 పరుగులు చేయగా, ర్యాన్ రికెల్టన్ 9, తిలక్ వర్మ0, రోహిత్ శర్మ 35, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 5, సూర్యకుమార్ యాదవ్ 51, నమన్ ధీర్ 28 పరుగులు చేసి అవుటయ్యారు. ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేటి మ్యాచ్‌లో ఆడటం లేదు. హార్దిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా లేనందున, తానే జట్టుకు నాయకత్వం వహిస్తున్నానని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు.

రోజులో రెండవ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us