RR Vs MI: ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు..

|

May 01, 2022 | 12:00 AM

IPL 2022: ఐపీఎల్‌ 2022(IPL 2022)లో ముంబై ఇండియన్స్‌ తొలి విజయం అందుకుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI) 5 వికెట్ల తేడాతో గెలుపొంది.

RR Vs MI: ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు..
Mi
Follow us on

ఐపీఎల్‌ 2022(IPL 2022)లో ముంబై ఇండియన్స్‌ తొలి విజయం అందుకుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI) 5 వికెట్ల తేడాతో గెలుపొంది. మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల్ కోల్పోయి 158 పరుగులు చేసింది. రాయల్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో తొలి వికెట్‌ కోల్పోయింది. 15 బంతుల్లో 15 పరుగులు చేసిన దేవదూత్‌ పడిక్కల్‌ షోకీన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ సంజు శాంసన్‌ దాటిగా అడే ప్రయత్నం చేశాడు. 7 బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టిన శాంసన్ మరో భారీ షాట్‌కు యత్నించగా బౌండరీ వద్ద ఫిల్డర్‌కు చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన డారిల్ మిచెల్‌ 17 పరుగులకే వెనుదిరిగాడు. రాజస్థాన్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. మరోవైప్‌ బట్లర్ ఆచితూచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత గేర్‌ మార్చి దాటిగా ఆడే క్రమంలో క్యాచ్‌ ఔట్‌ అయి పెవిలియన్‌ చేరాడు. బట్లర్‌ 52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67 పరుగులు చేశాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 9 బంతుల్లో 21 పరుగులు చేశాడు. హెట్మేయర్ 6, పరాగ్ 3, బౌల్ట్‌ 4 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో షోకీన్‌, మెరిడిత్‌కు రెండేసి వికెట్లు పడగొట్టగా.. కార్తికేయ, డానియల్ సామ్ ఒక్కో వికెట్ తీశారు.

159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మూడో ఓవర్‌లోని వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ క్యాచ్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత 18 బంతుల్లో 26 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ షార్ట్‌కు యత్నించి క్యాచ్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత సూర్యాకుమార్ యాదవ్, తిలక్‌వర్మ జట్టును ఆదుకున్నారు. 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 పరుగులు చేసిన సూర్యాకుమార్‌ యాదవ్‌ను చాహల్‌ బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్‌లో తిలక్‌ వర్మ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చి పోలార్డ్, టిమ్ డెవిడ్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో పోలార్డ్‌ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డానియల్ సామ్‌ సిక్స్ కొట్టి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ముంబై 19.2 ఓవర్లకు 5 వికెట్లు 161 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో బౌల్ట్‌, అశ్విన్, ప్రసిద్ధ్, కుల్దీప్ సేన్, చాహల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Read Also.. Virat Kohli: ఎట్టకేలకు హాఫ్‌ సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీ.. గుజరాత్‌ టైటాన్స్‌పై 58 పరుగులు చేసిన మాజీ కెప్టెన్‌..