చెన్నైపై ముంబై ఘన విజయం

ఐపీఎల్‌ 2019లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 46 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టును 109 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై ఆటగాళ్లు 17.4 ఓవర్లకు 109 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. చెన్నై ఆటగాళ్లలో విజయ్ 38, వాట్సన్ 8, రైనా 2, అంబటి రాయుడు 0, జాదవ్ 6, బ్రావో 20 పరుగులు చేశారు. ముంబై […]

చెన్నైపై ముంబై ఘన విజయం

Edited By:

Updated on: Apr 27, 2019 | 6:08 AM

ఐపీఎల్‌ 2019లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 46 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 156 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టును 109 పరుగులకే కట్టడి చేసింది. చెన్నై ఆటగాళ్లు 17.4 ఓవర్లకు 109 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యారు. చెన్నై ఆటగాళ్లలో విజయ్ 38, వాట్సన్ 8, రైనా 2, అంబటి రాయుడు 0, జాదవ్ 6, బ్రావో 20 పరుగులు చేశారు.
ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మ 67, డి కాక్ 15, లెవిస్ 32, హార్ధిక్ పాండ్యా 23, పొలార్డ్ 13 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో మలింగ 4, కృణాల్ పాండ్యా 2, హార్ధిక్ పాండ్యా 1, బుమ్రా 2, అనుకుల్ రాయ్ ఒక వికెట్ తీశారు.