MS Dhoni: సీఎస్కేలో ధోనీకి వాటా ఎంత.. విలువ ఎంతో తెలుసా..?

MS Dhoni CSK Shares: చెన్నై సూపర్ కింగ్స్‌లో ఎంఎస్ ధోనీకి దాదాపు లక్ష షేర్లు ఉన్నట్లు క్రిక్ బజ్ నివేదిక పేర్కొంది. వాటి విలువ సుమారు రూ.2.6-3 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే చెన్నైలో ధోనీ వాటా అధికారికంగా ధ్రువీకరించలేదు. గతంలో ఆయన స్టేక్‌హోల్డర్ కాదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ చెప్పిన విషయం తెలిసిందే.

MS Dhoni: సీఎస్కేలో ధోనీకి వాటా ఎంత.. విలువ ఎంతో తెలుసా..?
Ms Dhoni Csk Shares

Updated on: Sep 11, 2026 | 6:58 PM

MS Dhoni CSK Shares: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఎంఎస్ ధోనీ అనుబంధం గురించి కొత్త సమాచారం తెరపైకి వచ్చింది. చెన్నైలో మాజీ కెప్టెన్‌కు దాదాపు లక్ష షేర్లు ఉన్నట్లు క్రిక్ బజ్ నివేదిక పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.2.6-3 కోట్లు ఉంటుందని తెలిపింది. అయితే ధోనీకి ఈ వాటా ఉన్న విషయం అధికారికంగా సీఎక్కే ప్రకటించలేదు.

సీఎస్కేలో ప్రధాన వాటాదారులు..

హోలిహన్ లౌకీ ఐపీఎల్ బ్రాండ్ వాల్యువేషన్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ విలువ రూ.2,033 కోట్లుగా ఉంది. కంపెనీలో శ్రీనివాసన్ కుటుంబానికి 55 శాతానికి పైగా కంట్రోలింగ్ స్టేక్ ఉన్నట్లు సమాచారం. మరోవైపు 30 కోట్లకు పైగా ఔట్ స్టాండింగ్ షేర్ పబ్లిక్ హోల్డింగ్‌లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఈ వాటాల్లోనే ధోనీకి దాదాపు లక్ష షేర్లు ఉన్నట్లు వెల్లడించింది.

ఎక్కువమంది చదివినది: బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..!

ఇవి కూడా చదవండి

ఎలా కొనుగోలు చేశారంటే..

సీఎక్కే ఒక అన్ లిస్ట్ డ్ కంపెంనీ. అందువల్ల దాని షేర్లు ఓపెన్ మార్కెట్ సాధారణంగా ట్రేడ్ కావు. ప్రైవేట్ ఆఫ్ మార్కెట్ ట్రాన్ జాక్సన్స్ ద్వారా వాటిని కొనుగోలు చేయవచ్చని క్రిక్ బజ్ నివేదిక తెలిపింది. గతంలో ధోనీ సీఎస్కేలో స్టేక్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చినప్పటికీ, ఆ ప్రతిపాదనపై మేనేజ్‌మెంట్ అంగీకరించలేదని పేర్కొంది.

గతంలో సీఎక్కే నుంచి భిన్నమైన మాట..

ధోనీ సీఎస్కేలో స్టేక్ అడిగినట్లు వచ్చిన వార్తలను గతంలో సీఈవో కాశీ విశ్వనాథన్ ఖండించారు. ధోనీ తమను సంప్రదించలేదని, ఈ అంశంపై చర్చ జరగలేదని ఓ సీనియర్ సీఎస్కే అధికారి చెప్పినట్లు నివేదిక పేర్కొంది. శ్రీనివాసన్‌తోనూ ధోనీ ఈ విషయంపై మాట్లాడిన సమాచారం తమకు లేదని ఆయన తెలిపారు.

ఎక్కువమంది చదివినది: Viral Video: హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాక్‌ఫ్లిప్ క్యాచ్ వీడియో వైరల్.. అసలు విషయం ఇదే..!

ధోనీ పెట్టుబడులు..

క్రికెట్‌తో పాటు ఇతర రంగాల్లోనూ ధోనీ పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. ఆయన చెన్నైయిన్ ఎఫ్సీ (Chennaiyin FC)కి యజమానిగా ఉండటంతో పాటు సెవెన్ (SEVEN), స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ (SportsFit World), రితి స్పోర్ట్స్ (Riti Sports)లో పెట్టుబడులు పెట్టారు. గరుడా ఎయిర్ స్పేస్ (Garuda Aerospace), కార్స్ 24 (CARS24), హమ్ లేన్ (HomeLane), ఈమోటార్డ్ (EMotorad) వంటి సంస్థల్లోనూ ఆయన పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం. రిగి (Rigi), అకో (Acko), సోలార్ స్కేర్ (SolarSquare), స్పేస్ ఎక్స్ (SpeakX) తదితర స్టార్టప్స్ తో పాటు శాఖహారీ (Shaka Harry)లోనూ ఆయన పెట్టుబడులు పెట్టినట్లు నివేదిక పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us