MS Dhoni : మధురైలో ధోనీ మేనియా.. కొత్త స్టేడియం ప్రారంభోత్సవానికి వచ్చిన మహీని చూసి అభిమాని ఏం చేశాడంటే ?

క్రికెట్ లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని గురువారం మధురైలో అడుగు పెట్టడంతో ఆ నగరం మొత్తం పసుపుమయంగా మారిపోయింది. వెలమ్మాళ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, టీఎన్‌సీఏ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్ లెవల్ వెలమ్మాళ్ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి ధోని ముఖ్య అతిథిగా వచ్చారు.

MS Dhoni : మధురైలో ధోనీ మేనియా.. కొత్త స్టేడియం ప్రారంభోత్సవానికి వచ్చిన మహీని చూసి అభిమాని ఏం చేశాడంటే ?
Ms Dhoni (2)

Updated on: Oct 10, 2025 | 8:00 PM

MS Dhoni : క్రికెట్ లెజెండ్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని గురువారం మధురైలో అడుగు పెట్టడంతో ఆ నగరం మొత్తం పసుపుమయంగా మారిపోయింది. వెలమ్మాళ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, టీఎన్‌సీఏ సహకారంతో నిర్మించిన ఇంటర్నేషనల్ లెవల్ వెలమ్మాళ్ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి ధోని ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో స్టేడియంలో ధోనిని చూసేందుకు వందలాది మంది అభిమానులు పోటెత్తారు. ముఖ్యంగా ధోని ఒక చిన్న అభిమాని పట్ల చూపిన మర్యాద ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంది.

ధోని మధురై చేరుకోగానే, ఎయిర్‌పోర్ట్ నుండి స్టేడియం వరకు అభిమానులు కిక్కిరిసిపోయారు. దాదాపు 44 ఏళ్ల ధోని తన ట్రేడ్‌మార్క్ సన్‌గ్లాసెస్‌లో, సాధారణ దుస్తులలో కనిపించగానే, అభిమానులు ఉత్సాహంతో ధోని, ధోని అంటూ నినాదాలు చేశారు. అభిమానులకు ధోని అభివాదం చేస్తూ, చిరునవ్వులు చిందించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

వెలమ్మాళ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 11.5 ఎకరాలలో రూ.325 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ కొత్త స్టేడియాన్ని ధోని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ స్థాయి స్టేడియంలో 7,300 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది, దీనిని భవిష్యత్తులో 20,000 మందికి విస్తరించనున్నారు. ఈ వేదికలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్రాక్టీస్ నెట్స్, అడ్వాన్స్‌డ్ డ్రైనేజీ, ఫ్లడ్‌లైట్లు వంటి సదుపాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇక్కడ టీఎన్‌పీఎల్, రంజీ ట్రోఫీ, ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్‌లో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఏమిటంటే, ధోని బ్యాట్ పట్టుకుని క్రీజులోకి వెళ్లి కొన్ని ట్రేడ్‌మార్క్ షాట్లు ఆడటం. ధోని బ్యాటింగ్ మొదలు పెట్టగానే అభిమానుల కేరింతలు మిన్నంటాయి.

ధోని బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వెళ్తున్న సమయంలో, ఒక చిన్న అభిమాని ధోని దగ్గరకు వచ్చాడు. ఆ అభిమాని తన ఆరాధ్య దైవమైన ధోని పట్ల గౌరవం చూపించడానికి వంగి పాదాలను తాకబోయాడు. అప్పుడు ధోని చూపిన స్పందన అందరి మనసులను గెలుచుకుంది. వెంటనే ధోని ఆ కుర్రాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచాడు. ఆ కుర్రాడు నమస్కారం పూర్తి చేసే వరకు ఓపికగా వేచి చూశాడు. ఆ తర్వాత అతనికి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి, హెల్మెట్‌పై మెల్లగా తట్టాడు. ధోనిలో ఉన్న వినయం, మంచితనానికి ఈ సంఘటన గొప్ప నిదర్శనంగా నిలిచింది. ఈ చిన్నప్పటి అభిమాని పట్ల లెజెండ్ చూపిన ఆదరణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోని, అతని అభిమానుల మధ్య బంధం ఎంత బలమైందో ఇది మరోసారి రుజువు చేసింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..