అవసరాన్ని బట్టి ధోని బ్యాటింగ్‌కు దిగుతాడు- ఫ్లెమింగ్‌

చెన్నై: సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ ఐపీఎల్‌లో ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడన్న విషయం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారే ఫలానా నెంబర్ అంటూ తమకు తోచిన విధంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ క్లారిటీ ఇచ్చాడు. గతేడాది ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని జట్టుకు ఎన్నో విజయాలను అందించాడని గుర్తు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో కూడా అతడిని అదే […]

అవసరాన్ని బట్టి ధోని బ్యాటింగ్‌కు దిగుతాడు- ఫ్లెమింగ్‌

Updated on: Mar 20, 2019 | 8:52 PM

చెన్నై: సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ ఐపీఎల్‌లో ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడన్న విషయం ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఎవరికి వారే ఫలానా నెంబర్ అంటూ తమకు తోచిన విధంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ క్లారిటీ ఇచ్చాడు. గతేడాది ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని జట్టుకు ఎన్నో విజయాలను అందించాడని గుర్తు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో కూడా అతడిని అదే స్థానంలో కొనసాగిస్తామని ఫ్లెమింగ్‌ తెలిపాడు.అవసరాన్ని బట్టి ఇతర స్థానాల్లోనూ ఆడతాడని స్పష్టం చేశాడు. గత సీజన్‌లో కేదార్‌ జాదవ్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో మిడిలార్డర్‌ పూర్తి బాధ్యతను ధోని తీసుకున్నాడని పేర్కొన్నాడు.జాదవ్‌, ధోనిలు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల సమర్థులని ఫ్లెమింగ్‌ కితాబిచ్చాడు.

రైనా, ధోని, డుప్లెసిస్‌, వాట్సన్‌, జాదవ్‌, రాయుడులతో సీఎస్‌కే బ్యాటింగ్‌ దుర్బేద్యంగా ఉందని.. హర్భజన్‌ సింగ్‌, కరణ్‌ శర్మ, తాహీర్‌, సాంట్నర్‌లతో స్పిన్‌ కూడా బలంగా ఉందిని ప్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ నెల 23న ఐపీఎల్‌ సీజన్‌ 12 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సీఎస్‌కే కోహ్లి సారథ్యంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో తలపడనుంది.

Follow Us